Dharmasthala Case: 'ధర్మస్థలి' అంతా అబద్ధమేనా.. అంతు చిక్కని 5 ప్రశ్నలివే!

ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తానే స్వయంగా శవాలు పూడ్చేశానని అక్కడ పని చేసిన ఓ కార్మికుడు చెప్పడం సంచలనంగా మారింది. సడెన్‌గా ఇప్పుడు అతడు మాట మార్చాడు. పోలీసులే కాదు ప్రజలు కూడా అతడు చెప్పే మాటలు నిజమని నమ్మారు.

New Update
Dharmasthala case

ధర్మస్థలంలో వరుస హత్యలు? ధర్మస్థలలో దారుణాలు?.. ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా మీడియాలో వచ్చాయి. ధర్మస్థల పుణ్యక్షేత్రం పరిసరాల్లో తానే స్వయంగా శవాలు పూడ్చేశానని అక్కడ పని చేసిన ఓ కార్మికుడు చెప్పడం సంచలనంగా మారింది. సడెన్‌గా ఇప్పుడు అతడు మాట మార్చాడు. పోలీసులే కాదు ప్రజలు కూడా అతడు చెప్పే మాటలు నిజమని నమ్మారు. ఇలా దక్షిణ కన్నడ జిల్లాలో కొద్దిరోజులుగా అలజడి కొనసాగుతోంది. 

ధర్మస్థల వ్యవహారం(Dharmasthala Case) సీరియస్‌గా కనిపించడంతో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం SITను ఏర్పాటు చేసింది. ఈ టీం శవాలను పూడ్చిపెట్టానని చెప్పిన మాజీ కార్మికుడు చెప్పిన 17 చోట్ల తవ్వించారు.. అయితే ఎక్కడా మృతదేహాలు లభించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బైటపడింది. పోలీసులనే కాదు యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టించిన ఈ మాస్క్ మ్యాన్ ఫోటో బయటకువచ్పింది. అతడు తప్పుడు సమాచారం ఇచ్చాడని తేలడంతో ఈ మాస్క్ మ్యాన్ ని అరెస్ట్ చేశారు.

అతని పేరు సి.ఎన్. చిన్నయ్య అలియాస్ చెన్న అని పూర్తి వివరాలు బయటపడ్డాయి. అతనొక్కడే కాదు, మరో మహిళ సుజాతా భట్ కూడా ఆమె కూతురి మిస్సింగ్ కేసుకు ధర్మస్థల కేసుకు లింక్ ఉందని ఆరోపించారు. ఇప్పుడు ఆమెకు అసలు కూతురే లేదని తేలింది. అసలు ధర్మస్థల కేసులో ఏం జరుగుతోంది. అంతా అయోమయంగా ఉంది. మొదటి ముందుకొచ్చిన సాక్ష్యులు వరుసగా తామే అబధ్దం చెప్పినట్లు, పోలీసులను తప్పుదారి పట్టించినట్లు చెబుతున్నారు. 
ధర్మస్థలలో మాజీ స్వీపర్‌గా పని చేసిన చిన్నయ్య అనేక చోట్ల 70–80 మృతదేహాలను పూడ్చిపెట్టాడని పేర్కొన్నాడు. విచారణ కోసం అతన్ని రాత్రంతా అదుపులోకి తీసుకున్నారు మరియు శనివారం అరెస్టు చేశారు. 1998-, 2014 మధ్య అనేక మంది స్త్రీలను, పిల్లలను పాతిపెట్టినట్లు తాను చెప్పుకుంటున్న 15 ప్రదేశాల గురించి అతను SITకి చెప్పాడు. కానీ ఈ ప్రదేశాలలో ఒక చోట మాత్రమే (స్పాట్ నంబర్ 6) ఒక పురుషుడి అస్థిపంజరం అవశేషాలు లభించాయి.

దర్యాప్తులో ఆ విజిల్ బ్లోయర్ చూపించిన పుర్రె నిజమైనది కాదని, నకిలీదని తేలిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ వెల్లడి తర్వాత, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం మరియు నకిలీ సాక్ష్యాలను సమర్పించడం వంటి ఆరోపణలపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఈ సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో అనేక అనుమానలు ఇంకా ప్రశ్నలు రూపంలోనే ఉన్నాయి. 

Also Read :  వాట్సాప్‌లో వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే.. అకౌంట్‌లో రూ.2 లక్షలు స్వాహా

ప్రశ్నలు:

  • లైవ్ డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమంటూ సవాల్ విసిరిన కార్మికుడు ఇప్పుడు సడెన్‌గా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు?
  • ఇదే సమయంలో సుజాతా భట్ కూడా ఎందుకు మాట మార్చారు?
  • కూతురే లేదని ఆమె చెప్పే వరకు పోలీసులు ఎందుకు కనిపెట్టలేదు?
  • గతంలో తనను కొందరు బెదిరిస్తున్నారని పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించాడు.. ఇప్పుడు కూడా వారి బెదిరింపుల కారణంగానే మాట మార్చాడా?
  • జూలై 4 ఎఫ్‌ఐఆర్ నమోదు, 29 నుంచి తవ్వకాలు ప్రారంభం అయితే.. కార్మికుడు తాను చెప్పేది అబద్ధమని ప్రకటించే వరకు పోలీసులు ఎందుకు ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు.

Also Read :  ఏడాదికి 50 రాకెట్ల ప్రయోగం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు