Tirumala Parakamani Theft Case : వివాదంలో పరకామణి...అసలు పరకామణి కేసు ఏంటి?

కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం కొనసాగతుండగానే పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.  దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

New Update
FotoJet - 2025-11-25T121520.185

Tirumala Parakamani Theft Case

Tirumala Parakamani Theft Case: కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు పిలుచుకునే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల  లడ్డూ వివాదం కొనసాగతుండగానే దేవస్థానం పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.  దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్‌ భానుప్రకాష్‌ అండ్‌ కిరణ్‌ రాయల్‌గా ఈ ఎపిసోడ్‌ టర్న్‌ తీసుకుంది.

పరకామణి పాలిటిక్స్‌ ఏపీలో కాక రేపుతోంది. తన హయాంలో తప్పు జరిగిందని తెలిస్తే తల నరుక్కుంటానన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి..కాగా ఈ మేరకు  టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కి పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీస్ ఇచ్చారు.నేడు మద్యాహ్నం 3:30 గంటలకు పద్మావతి అతిధిగృహంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ కోరింది. ఈ క్రమంలో  అసలు పరకామణి కేసు ఏంటి? అనేది తెలుసుకుందాం..

Also Read: దుమ్ము రేపుతోన్న 'రాజు వెడ్స్ రాంబాయి' బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్.. 4 డేస్ కలెక్షన్స్ ఇదిగో!

పరకామణి అంటే ..

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పరకామణికి శతాబ్దాల చరిత్ర ఉంది.వందల ఏళ్లుగా శ్రీవారికి వస్తున్న నగదు, కానుకలను లెక్కించే కార్యక్రమాన్ని పరకామణి అని పిలుస్తున్నారు.17వ శతాబ్దం కంటే ముందే పరకామణి ఉన్నట్లు చెబుతారు.భక్తులు తమ తమ స్థాయిని బట్టి నగలు, నగదును శ్రీవారికి హుండీ ద్వారా సమర్పిస్తారు. శ్రీవారి ఖజానాకు బంగారు, వెండి కానుకలు కూడా వస్తుంటాయి.17 శతాబ్దం ముందు నుంచే శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తులు కానుకలు సమర్పించినట్లు శ్రీవారి ఆలయ చరిత్ర చెబుతోంది.శ్వేత వస్త్రంతో కూడిన గంగాళాన్ని భక్తులు హుండీగా పిలుస్తారు. హుండీగా పరిగణించే గంగాళం కానుకలతో నిండిన తర్వాత లెక్కింపు కోసం పరకామణికి చేర్చుతారు.ఈ గంగాళాలను విజిలెన్స్, ఆలయ అధికారులు, బొక్కసం సిబ్బంది సమక్షంలో తెరిచి లెక్కిస్తారు.

12 నుంచి 14 గంగాళాలు

1965 వరకు బంగారు వాకిలి దగ్గరే లెక్కింపు జరిగేది..ఆ తర్వాత కానుకలు రావడం పెరగడంతో హుండీ లెక్కింపునకు ఆలయ ప్రాగణంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు. కట్టుదిట్టమైన నిఘా నడుమ హుండీ లెక్కింపు సాగుతుంది.చిల్లర నాణేలు, స్వదేశీ, విదేశీ నోట్లు, పురాతన నాణేలు, ఆభరణాలు, ముడుపులు, వస్తువులు, విలువైన పత్రాలు, కోర్కెల చిట్టాలు, శుభలేఖలు, విజిటింగ్ కార్డులు, కలకండ, బియ్యం, పసుపు… ఇలా రకరకాల కానుకలు హుండీకి చేరుతున్నాయి. భక్తులు సమర్పించే కానుకలతో రోజూ 12 నుంచి 14 గంగాళాలు నిండుతాయి.ఈ గంగాళాలను బంగారు వాకిలి వద్దకు తరలించి ఏకాంత సమయానికి స్ట్రాంగ్ రూమ్‌కు చేరుస్తారు.పరకామణిలో సీసీ కెమెరాల నిఘా నేత్రాల నడుమ కట్టుదిట్టంగా హుండీ కానుకలను లెక్కిస్తారు.

Also Read: ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో బడా హీరో.. ఏకంగా ఆ సినిమాతో కనెక్షన్..?

అసలేం జరిగిందంటే..?
ఇక తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేస్తుండేవాడు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ.. విదేశీ కరెన్సీని లెక్కించే విభాగంలో పనిచేసేవాడు. అయితే ఆయన చాలాకాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి.. ఈ క్రమంలోనే.. 2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబుల్లో దాచుకున్నాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా విదేశీ కరెన్సీతో పట్టుబడ్డాడు. ఆరోజు అతను 900 డాలర్లు అపహరించగా, అప్పట్లో వాటి విలువ రూ.72 వేలుగా తేల్చారు. ఇలా రవికుమార్ చాలాకాలంగా పరకామణిలో డబ్బులు గుట్టుగా దాచి రూ.కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలు వచ్చాయి. అయితే.. పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమలకు విరాళంగా అందజేయించి, మిగిలిన ఆస్తులను కొందరు వారి పేరిట రాయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. రవికుమార్ ను పట్టుకున్న తర్వాత లోక్‌అదాలత్‌లో కేసును రాజీ చేయించి, అతడి ఆస్తులను కొట్టేసినట్లు ఆరోపణలున్నాయి.

 సీఐడీ విచారణకు ఆదేశం..
అయితే.. లోక్ అదాలత్‌ తీర్పుపై టీటీడీ బోర్డు మెంబర్‌ భాను ప్రకాశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు..పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల్లోపు విచారణ జరిపి నివేదికను సీల్డ్ కవర్‌లో అందివ్వాలని ఆదేశించింది.

సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్
పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. 20 ఏళ్లుగా రవికుమార్‌ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో కూడా దొంగతనాలు చేశాడని, అప్పుడు రవికుమార్‌ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భూమన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు భూమన.

కీలక సాక్షి మృతి

ఇదిలా ఉండగా  పరకామణి కేసులో కీలక సాక్షి, నిందితుడు, టిటిడి మాజీ ఎవిఎస్‌ఒ సతీష్‌కుమార్‌ (52) అనుమానాస్పదంగా మృతి చెందటం సంచలనంగా మారింది. తాడిపత్రి-గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి జూటూరు రైల్వేస్టేషన్ల అప్‌డౌన్‌ ట్రాక్‌ల మధ్య విగత జీవుడై ఉన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జిఆర్‌పి రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆయన పరకామణి కేసులో విచారణ నిమిత్తం గురువారం రైల్లో తిరుపతికి బయల్దేరినట్లు సమాచారం.


 ఇటు కూటమి ప్రభుత్వం.. అటు వైసీపీ ఆరోపణల మధ్య శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలను పక్కదోవ పట్టించిన కేసులో ఏం జరగనుందనేది.. తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

Advertisment
తాజా కథనాలు