Rajasthan: పిల్లలు పుట్టడం లేదని కోడల్ని చంపేశారు.. సగం కాలిన శవాన్ని

రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు.అనుమానం వచ్చిన గ్రామస్తులు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.

New Update
rajasthan

రాజస్థాన్‌(Rajasthan) లో దారుణం జరిగింది. పిల్లలు పుట్టడం(Infertility) లేదని కోడలును ఆమె అత్తమామలు హత్య(daughter-in-law Killed) చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నించారు.అనుమానం వచ్చిన గ్రామస్తులు చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు. సగం కాలిపోయిన బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, డీగ్ హాస్పిటల్ మార్చురీలో ఉంచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖో పోలీస్ స్టేషన్ పరిధిలోని కాక్రా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలు 2005లో కాక్రా గ్రామానికి చెందిన అశోక్‌తో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు పిల్లలు లేరు. సరళ గర్భం దాల్చలేదని అశోక్ తరచుగా వేధించేవాడు.  పిల్లలు పుట్టకపోవడం వల్ల ఆమె అత్తమామలు ఆమెను నిత్యం వేధించేవారు. ఇదే వేధింపులు చివరకు హత్యకు దారితీశాయి. ఆమె విడాకులకు అంగీకరించకపోవడం ఆమె హత్యకు మరో కారణం.

Also Read :  రేయ్ ఎవర్రా మీరంతా.. భార్య చెల్లితో భర్త.. బావ సోదరితో బామ్మర్ది జంప్

కోడలు చనిపోయిందంటూ నాటకం

ఆమెను హత్య చేసిన అనంతరం ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని అందులో తమ కోడలు చనిపోయిందంటూ నాటకం మొదలుపెట్టారు.అయితే గ్రామస్తులకు అనుమానం వచ్చి దహన సంస్కారాలు చేపట్టే ముందు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి అత్తమామలను ఫోన్ ద్వారా సంప్రదించి, అంత్యక్రియలు నిర్వహించవద్దని ఆదేశించారు. అయినప్పటికీ వారు ఆమె మృతదేహాన్ని త్వరగా తీసుకొని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే, దహన సంస్కారాలు జరగకముందే పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని, సగం కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామలపై హత్య కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!

Advertisment
తాజా కథనాలు