BIG BREAKING: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్!

నెల్లూరు జిల్లా సంగం మండలం పెరామన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే పై  టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. ఢీకొన్న తర్వాత కొంతదూరం కారును లాకెళ్లింది. ఈ ప్రమాదంలో  కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు. 

New Update
BREAKING

BREAKING

BIG BREAKING:  ఈ మధ్య రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువవుతోంది. ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తులో జనాల ప్రణాలతో ఆడుకుంటున్నారు కొందరు. కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నెల్లూరులో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 

ఏడుగురు స్పాట్ డెడ్.. 

వివరాల్లోకి వెళితే.. సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది.  రాంగ్ రూట్ లో వేగంగా  వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్ లోనే మృతి చెందారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని గుర్తుపట్టలేని విధంగా నుజ్జు నుజ్జు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్ధలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే మృతుల వివరాలను సేకరిస్తున్నారు. మృతిచెందిన వారిలో ఒక చిన్నారి కూడా ఉండడం ఎంతో విషాదకరం. 

Also Read: Road Accident: అయ్యో దేవుడా.. నలుగురు స్పాట్ డెడ్.. దైవ దర్శనానికి వెళ్లి అనంతలోకాలకు

Advertisment
తాజా కథనాలు