/rtv/media/media_files/2025/09/21/operation-hydra-in-gajula-ramaram-2025-09-21-12-44-21.jpg)
Operation Hydra in Gajula Ramaram
Hydra: హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో నిర్మించిన ఇండ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. దీనితో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.సుమారు 100 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ఆక్రమించారని, 60 నుంచి 70 గజాల్లో ఇండ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున అమ్ముతున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఆక్రమణదారుల చేతుల్లో రూ.4,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించింది. సర్వే నంబర్ 397లో నిర్మించిన అక్రమ ఇళ్లను కూల్చివేసింది.
వివరాల ప్రకారం.. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కబ్జాదారులు ఆక్రమించారు. దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో, హైడ్రా రంగంలోకి దిగింది. అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. కబ్జాల చెర నుంచి సుమారు 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించినట్లు చెబుతున్నారు. కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టారు. అయితే నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే నంబర్ 307లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు తొలగించే పనిలో హైడ్రా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ భూమికి కంచె వేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు 10 కి.మీ. దూరంలో గాజులరామారం ఉంది. ఇక్కడ వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్‌ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు ఈ భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు, నాలుగేళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40-50 కోట్ల వరకు ఉంటుంది. ఆ లెక్కన రూ.4500 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్ పరిసర ప్రాంతాల్లో చిన్నచిన్న పనులు చేసుకుంటున్న వారికి సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి పలువురు అమ్మేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, విద్యుత్ అధికారుల్లో కొందరు వీరికి సహకరిస్తుండడంతో కరెంటు మీటర్లొచ్చాయి. నల్లా కనెక్షన్లూ వచ్చాయి. దీంతో కొందరు అప్పులు చేసి మరీ సొంత ఇళ్లు కొంటున్నారు. వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న కబ్జాదారులు బహుళ అంతస్తుల భవనాలను కట్టుకుని, ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. ఇక, కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. హైడ్రా ఫుల్ ఫోర్స్ అక్కడే ఉండి కూల్చివేతల్లో నిమగ్నమైంది.
Also Read: 'కల్కి 2' నుండి దీపికను తీసేసారు సరే.. మరి బిడ్డను కనేదెవరు..?