ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!

భారత్ నుండి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.40,000 నుంచి 50,000 ఉండే విమాన టికెట్లు, ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.

New Update
US flights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా నిబంధనలు భారత్‌లో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు అమెరికాలోకి ప్రవేశించడానికి వారి కంపెనీలు $100,000 రుసుము చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధన సెప్టెంబర్ 21 నుండి అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో, ప్రస్తుతం వేలాది భారత్‌ టెక్ నిపుణులు తిరిగి అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ 24 గంటల్లో అమెరికా చేరుకోవాలని విదేశీ ఉద్యోగులను కోరింది. అలాగే అమెజాన్ లాంటి పలు కంపెనీలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాయి.

రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల

ఈ అనూహ్య పరిణామంతో, భారత్ నుండి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.40,000 నుంచి 50,000 ఉండే విమాన టికెట్లు, ఇప్పుడు రూ. 1.5 లక్షల నుండి రూ. 2.5 లక్షల వరకు పెరిగాయని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలలోని విమానాశ్రయాల్లో, తమ వీసా గడువు ముగియకముందే తిరిగి అమెరికా చేరుకోవాలని ఆందోళన చెందుతున్న ప్రయాణికులతో నిండిపోయాయి. కొన్ని విమానాల్లో, అమెరికాకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ప్రయాణికులు, చివరి క్షణంలో టికెట్లు రద్దు చేసుకుని కిందకు దిగిపోయిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

అమెరికాలో ఉన్న అనేక ప్రముఖ ఐటీ కంపెనీలు తమ హెచ్-1బీ ఉద్యోగులను అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా సెలవులపై భారత్‌కు వచ్చిన ఉద్యోగులు వెంటనే తిరిగి వెళ్లాలని, లేకపోతే కొత్త నిబంధనల ప్రకారం భారీ రుసుము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించాయి. దీంతో భారతీయ ఐటీ పరిశ్రమ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. హెచ్-1బీ వీసాలపై ఆధారపడిన చిన్న కంపెనీలు, స్టార్టప్‌లకు ఈ కొత్త ఫీజు పెద్ద ఆర్థిక భారం కానుంది.

ఈ నిబంధన కేవలం కొత్త వీసా దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి కాదని అమెరికా అధికారులు అనధికారికంగా స్పష్టం చేసినప్పటికీ, ప్రయాణికుల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది. ఈ సంక్షోభం భారతీయ టెక్కీలు, వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనిపై భవిష్యత్తులో మరిన్ని స్పష్టమైన వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు