Luxury Bus Fire: మరో లగ్జరీ స్లీపర్‌ బస్సులో అగ్నిప్రమాదం.. ఈసారి ఎక్కడంటే ?

తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సుకు మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

New Update
Luxury Bus Catches Fire In Maharashtra, Driver Evacuates Passengers

Luxury Bus Catches Fire In Maharashtra, Driver Evacuates Passengers

కర్నూల్‌ బస్సు అగ్నిప్రమాదం(Kurnool Bus Accident) తర్వాత వరుసగా ప్రైవేటు బస్సుల్లో అగ్నిప్రమాదాలు(Bus Fire Accident) జరగడం కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ఓ ప్రైవేటు లగ్జరీ బస్సుకు మంటలు(Luxury Bus Fire) అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమవ్వడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యింది.  

Luxury Bus Fire Accident In Maharashtra

Also Read: ఈసారి రిపబ్లిక్ డే డబుల్ ధమాకా.. 2026 జనవరి 26కి ఇండియా చరిత్రలో ఫస్ట్ టైం!

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన లగ్జరీ స్లీపర్‌ బస్సు ముంబై నుంచి జల్నాకు వెళ్తోంది. అయితే బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు నాగ్‌పూర్‌ నేషనల్ హైవేలో ఈ బస్సుకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కనే ఆపాడు. ఆ బస్సులో ఉన్న 12 మంది ప్రయాణికులను దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. 

Also Read: బీహార్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. దూసుకొస్తున్న సైలెంట్ వేవ్.. ఆ కూటమికి ఊహించని షాక్?

ఆ తర్వాత బస్సు మంటల్లో కాలిపోయింది. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. అంబులెన్సులు కూడా అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు. ఈ అగ్నిప్రమాదం వల్ల ఆ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. బస్సు మంటల్లో కాలిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కర్నూల్ జిల్లాలో కావేరి బస్సులో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది సజీవ దహనమైన ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే.  

Advertisment
తాజా కథనాలు