H1-B Visa: సడెన్ గా హెచ్ 1-బీ వీసాల ఫీజు పెంపు ఎందుకు? భారత్, చైనాల పై ఒత్తిడి కోసమేనా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సడెన్ గా హెచ్ 1- బీ వీసాల ఫీజును పెంచేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేగింది. ముఖ్యంగా భారత్, చైనాల్లో. ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? భారత్, చైనా లపై ఒత్తిడి తెచ్చేందుకేనా?

New Update
Trump

Trump

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం...మూడేళ్ళ నుంచీ సాగుతోంది.  ఎవరెంత  చెప్పినా..ఎంత మంది చనిపోతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుద్ధాన్ని ఆపడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల సమయం దగ్గర నుంచీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేస్తానని చెప్పారు. ఆయన ఎన్నికల వాగ్దానాల్లో ఇది కూడా ఒకటి.  తరువాత  ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.  జనవరి 20న ట్రంప్ పదవిలోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన రష్యా చేత యుద్ధం మానిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి తొమ్మది నెలలు గడిచింది...ట్రంప్ ప్రయత్నాలు వృధాగానే మిగిలిపోయాయి. ఎన్నో రకాలుగా పుతిన్ ను ఒప్పించేందుకు ట్రంప్ ట్రై చేశారు. చాలాసార్లు ఫోన్లో మాట్లాడారు. స్వయంగా కలిశారు కానీ ఏం లాభలేకపోయింది.  గత నెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా వచ్చారు. ట్రంప్, పుతిన్ అలస్కాలో భేటీ అయ్యారు. కానీ అందులో యుద్ధం గురించి తప్ప అన్నీ మాట్లాడారు. తరువాత కూడా అమెరికా అధ్యక్షుడు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ ఏమీ జరగలేదు.  

భారత్, చైనాలపై సుంకాలు..

తన మాట వినకపోవడంతో రష్యా పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేరే మార్గాన్ని చేపట్టారు. అదే ఆ దేశంతో  వాణిజ్యం చేసే మిగతా దేశాలపై సుంకాతో విరుచుకుపడడం.  ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక నార్మల్ గా అన్ని దేశాల మీదా సుంకాలు విధించారు.  తమతో వాణిజ్యం చేసే దేశాలు అన్నింటి మీదనా 25 శాతం సుంకాలను అమలు చేశారు.  వీటిపై చాలానే చర్చ జరిగింది. కానీ మూడు నెలల బ్రేక్ తరువాత వాటిని అమలు చేశారు. అయితే  భారత్, చైనాలపై ట్రంప్ అదనపు సుంకాలను విధించారు. దానికి కారణం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడమే.  భారత్, చైనాలు...మాస్కో నుంచి చమురు దిగుమతి చేసుకుంటూ యుద్ధానికి సాయం చేస్తున్నాయనేది అమెరికా వాదన. దానిని వెంటనే మానేయాలని ట్రంప్..భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకువచ్చారు.  కానీ ఋ రెండు దేశాలు ఆయన మాట వినలేదు. దీంతో వీరిపై అదనంగా మరో 25 శాతం సుంకాలతో దాడి చేశారు. వాణిజ్య చర్చలను ఆపేశారు. ఈ దెబ్బకు రెండూ దిగి వస్తాయని...రష్యాతో వ్యాపారం మానేస్తాయని అనుకున్నారు ట్రంప్. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. 

పట్టించుకోని భారత్, చైనాలు..

భారత్, చైనాలు...అమెరికా అదనపు సుంకాలను ఈక కింద తీసిపారేశాయి.  వీటి కారణంగా భాత్, చైనాల మధ్య స్నేహం తిరిగి చిగురించింది కూడా.  దీంతో పాటూ అమెరికా సుంకాల నష్టాన్ని పూడ్చేందుకు భారత్...మిగతాదేశాలతో వాణిజ్యం మరింత ఎక్కువ  చేసింది. అసలు అమెరికాను పట్టించుకోలేదు. కనీసం ఒక్కసారి కూడా వారి దగ్గరకు వెళ్ళి సుంకాల గురించి మాట్లాడలేదు.  అమెరికా వాణిజ్య చర్చలకు రాకపోయినా పట్టించుకోలేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు అనుకున్నది నేరవేరలేదు.  అదనపు సుంకాలు అమల్లోకి రాగానే...భారత ప్రధాని మోదీ చైనా, జపాన్ టైర్లేశారు. అక్కడ రష్యా అధ్యక్షులు పుతిన్, జిన్ పింగ్ లను కలిసి వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చర్లు చేశారు. దాంతో పాటూ జపాన్, మిడిల్స్ ఋస్ట్ దేవాలతో కూడా వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు చర్చలు చేశారు.  దీంతో ట్రంప్ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. 

దీంతో ఏం చేసేది లేక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగి వచ్చారు. భారత్ తో  వాణిజ్య చర్చలు చేస్తామని చెప్పారు. దాంతో పాటూ ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని..భారత్ మంచి సంబంధాలున్నాయని స్వయంగా ప్రకటించారు. కానీ భారత్, చైనాలపై ఒత్తిడి తెచ్చేందుకు మరో రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  యూరోపియన్ యూనియన్, జీ 7 దేశాలకు కూడా చెప్పారు భారత్, చైనాలపై అధిక సుంకాలను విధించాలని.  ఙప్పుడు ఙందులో భాగంగానే హెచ్ 1-బీ వీపాల పెంపు అని కూడా చెబుతున్నారు. 

ఈ రెండు దేశాల నుంచే ఎక్కువ..

అమెరికాకు హెచ్ 1-బీ వీసాల మీద వచ్చే దేశాల్లో భారత్, చైనాలు ముందుంటాయి.  అందరి కంటే అధికంగా భారత్ నుంచే హెచ్ 1-బీ వీసాల మీద అమెరికాకు వెళతారు. దాదాపు ఏడాదికి 80 వేల మంది దాకా ఇండియా నుంచి అమెరికాకు వెళతారు. దీని తరువాతి స్థాం చైనాదే.  అందుకే సుంకాలతో తేలేని ఒత్తిడిని వీసాల ద్వారా సాధించాలని అనుకున్నారు.  ఆప్లాన్ లో భాగంగానే వీసాల ఫీజులను భారీగా పెంచారని విశ్లేషకులు చెబుతున్నారు.  దీని వలన అమెరికాకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఉద్యోగులు చాలా కష్టాలను ఎదుర్కొంటారు.  దాని ద్వారా ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడుతుంది.  అందుకే ట్రంప్ సడెన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విధంగా ఆ దేశాలపై ఒత్తిడి తీసుకురావచ్చని ట్రంప్ భావించారని అంటున్నారు.  

అయితే వీసాల ఫీజు పెంపుపై భారత్ నార్మల్ గానే స్పందించింది.  మన దేశంలోనే ఉండండి..దేశాభివృద్ధికి పాటుపడండి అంటూ ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఆందోళన చెందవద్దని...త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.  కానీ వీసాల ఫీజు పెంపు చాలా మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది. దీనిపై త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని అంటున్నారు.  

Also Read: BIG BREAKING: వార్షిక రుసుము కాదు..వన్ టైమ్ ఫీజు-వైట్ హౌస్ క్లారిటీ

Advertisment
తాజా కథనాలు