/rtv/media/media_files/2025/09/21/meerut-young-man-absconded-with-bike-pretext-of-test-drive-2025-09-21-18-28-12.jpg)
meerut young man absconded with bike pretext of test drive
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నౌచండి ప్రాంతంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒక యువకుడు టెస్ట్ డ్రైవ్ చేసినట్లు నటించి బైక్‌తో పారిపోయాడు. ఎంత సేపటికీ ఆ యువకుడు తిరిగి రాకపోవడంతో షాపు యజమాని ఖంగుతిన్నాడు. వెంటనే సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేయగా.. పారిపోయినట్లు గుర్తించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
meerut young man Bike Theft
షాపు ఓనర్ రషీద్ లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాలిమార్ గార్డెన్‌లో నివసిస్తున్నాడు. అతను బైక్‌లను రిపేర్ చేసి సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతుంటాడు. ఇందులో భాగంగానే ఒక యువకుడు రషీద్ లిసాడి షాప్‌కు వెళ్లాడు. బైక్ కొనాలని చెప్పి పలు బైక్‌లను చూశాడు. అందులో ఒక బైక్‌ను రూ.15000లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం డబ్బులు ఇవ్వకుండానే.. మొదట టెస్ట్ డ్రైవ్ చేస్తానని ఆ ఓనర్‌ను నమ్మించాడు.
मेरठ में टेस्ट ड्राइव के बहाने ये टोपीवाले जनाब बाइक ही लेकर फुर्र हो गए। बाइक मालिक इंतजार करता रहा कि ग्राहक लौटेगा लेकिन न ग्राहक लौटा न बाइक मिली, अब पुलिस इन्हें सीसीटीवी में देखकर तलाश रही है। pic.twitter.com/SzYkm33GtM
— shalu agrawal (@shaluagrawal3) September 20, 2025
అలా ఆ యువకుడి మాయలో పడిపోయిన ఓనర్ రషీద్.. అతడికి బైక్ ఇచ్చాడు. వెంటనే ఆ యువకుడు కొంత దూరం మెల్లగా వెళ్లి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఎంత సేపటికీ ఆ యువకుడు తిరిగి రాలేదు. ఓనర్ అతడి కోసం ఎదురు చూసి చూసి.. చివరి తన షాప్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను చూశాడు. అది చూసిన తర్వాత ఆ యువకుడు బైక్‌తో పారిపోయినట్లు గ్రహించాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు.
అక్కడ జరిగిన విషయాన్ని తెలియజేశాడు. తనకు పరిచయం ఉన్న ఒక వ్యక్తి ఆ నిందితుడిని తన షాప్‌కు తీసుకువచ్చాడని పోలీసులకు తెలిపాడు. ఆ యువకుడిని షాప్‌కు తీసుకువచ్చిన వ్యక్తి పేరు అయాన్ అని రషీద్ చెప్పాడు. అయితే పోలీసులు బైక్ ఓనర్ రషీద్‌కు షాక్ ఇచ్చారు. బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో వారిని తీసుకురావాలని పోలీసులు చెప్పారు. దీంతో ఇప్పుడు బైక్ యజమానిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తామని రషీద్ తెలిపారు. దీనిపై సివిల్ లైన్స్ సీఓఓ అభిషేక్ తివారీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.