/rtv/media/media_files/2026/02/20/madam-zeher-2026-02-20-16-06-51.jpg)
ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన ఓ లేడీ డాన్(Delhi Lady Don) క్రైమ్ స్టోరీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పగటిపూట బ్యూటీ పార్లర్ నడుపుతూ, మేకప్ ఆర్టిస్ట్‌గా సామాన్య జీవనం గడిపే ఒక మహిళ.. రాత్రి అయితే డ్రగ్స్ నెట్‌వర్క్‌ను నడిపిస్తూ 'మేడమ్ జెహర్'గా చెలామణి అవుతోందని పోలీసులు గుర్తించారు.
Lady don 'Madam Zeher' of Lawrence Bishnoi gang nabbed, ran drug trafficking network posing as makeup artist https://t.co/uv5XNEptav#inqalabNews#indiapic.twitter.com/8FTfUUgO4x
— Inqalab News (@InqalabNewsIN) February 19, 2026
Also Read : ఇండియాకు గుడ్‌న్యూస్.. తారిఖ్ రహమాన్ ప్రధాని అయిన 3 రోజుల్లోనే కీలక నిర్ణయం
ముసుగులో నేర సామ్రాజ్యం
ఢిల్లీ పోలీసు(delhi-police) ల స్పెషల్ సెల్ ఇటీవల నిర్వహించిన ఆపరేషన్‌లో ఖుష్నుమా అన్సారీ అలియాస్ నేహా అనే మహిళను అరెస్ట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలోని ఆమె బ్యూటీ పార్లర్ కేవలం ఓ ముసుగు మాత్రమేనని విచారణలో తేలింది. స్థానికులకు ఆమె సాధారణ పార్లర్ యజమాని, మేకప్ ఆర్టిస్ట్. ఈ ముసుగు వెనుక ఆమె లారెన్స్ బిష్ణోయ్, హాషీమ్ బాబా గ్యాంగ్‌ల డ్రగ్ సిండికేట్ నడిపించే కీలక సూత్రధారి. ఆమె వద్ద దొరికిన డ్రగ్స్ నిల్వలు, నెట్‌వర్క్ చూసి ఇన్వెస్టిగేటర్లే ఆమెకు 'మేడమ్ జెహర్' అని పేరు పెట్టారు. మహిపాలపూర్ ఫ్లైఓవర్ వద్ద నేహాను అరెస్ట్ చేసిన సమయంలో ఆమె వద్ద పెద్ద మొత్తంలో హెరాయిన్, ఇతర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ సెల్ అధికారులు ధృవీకరించారు. నిందితులను ప్రస్తుతం విచారిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్లతో సంబంధాలు
పోలీసుల కథనం ప్రకారం, నేహా గత ఏడేళ్లుగా మహ్ఫూజ్(Mahfooz) అలియాస్ బాబీ కబూతర్ అనే గ్యాంగ్‌స్టర్(gangster) తో సంబంధం కలిగి ఉంది. ఈ బాబీ కబూతర్ లారెన్స్ బిష్ణోయ్(lawrence-bishnoi) గ్యాంగ్‌కు ఆయుధాలు సరఫరా చేసే కీలక వ్యక్తి. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బాబీ కబూతర్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. నటి దిశా పటానీ ఇంటి వద్ద కాల్పులు, జిమ్ ట్రైనర్ నాదిర్ షా హత్య కేసుల్లో నేహా సహచరుల పేర్లు వినిపించాయి. ఢిల్లీ- ఎన్‌సీఆర్ పరిధిలో డ్రగ్స్ డిస్టిబూషన్ నెట్‌వర్క్‌ను నేహా తన పార్లర్ నుండే పర్యవేక్షించేదని పోలీసులు గుర్తించారు.
Also Read : పురిటినొప్పులు భరించలేక.. పొత్తికడుపు కోసుకుంది.. చివరకు ఏమైందంటే?
ఢిల్లీలో పెరుగుతున్న 'లేడీ డాన్'ల సంస్కృతి
నేహా అరెస్టుతో ఢిల్లీ క్రైమ్ వరల్డ్‌లో మహిళల పాత్ర పెరుగుతోందనే విషయం మరోసారి స్పష్టమైంది. గతంలో గ్యాంగ్‌స్టర్ హాషీమ్ బాబా భార్య జోయా ఖాన్, సోషల్ మీడియాలో తుపాకులతో రీల్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన జిక్రా వంటి వారు కూడా పోలీసులకు చిక్కారు. వీరంతా క్రిమినల్స్ ఇన్ఫర్మేషన్ మార్పిడికి లేదా ఆపరేషనల్ హెడ్స్‌గా వ్యవహరిస్తున్నారు.
Follow Us