/rtv/media/media_files/2026/02/20/women-2026-02-20-07-46-49.jpg)
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల నంకై అనే గర్భిణికి గురువారం మధ్యాహ్నం ప్రసవ వేదన మొదలైంది. అయితే, ఆ నొప్పులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో, ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక ఇంట్లో కూరగాయలు కోసే కత్తితో తన కడుపును తనే కోసుకుంది. ఆమె పెట్టిన కేకలు విన్న పొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని, ఆమెను ఫకర్పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
నార్మల్ డెలివరీ జరిగినప్పటికీ
ఆసుపత్రికి చేరిన తర్వాత ఆమె ఒక ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ జరిగినప్పటికీ, ఆమె అంతకుముందే కత్తితో కడుపు కోసుకోవడం వల్ల పరిస్థితి విషమించింది. ఆమె ప్రేగులు బయటకు రావడం, భారీగా రక్తస్రావం కావడంతో వైద్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఆమెను లక్నోలోని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఆమె స్ట్రెచర్ మీద పడుకుని, నొప్పులు భరించలేకే కడుపు కోసుకున్నానని చెబుతున్నట్లు తెలుస్తోంది. పాపం, ఆమె భర్త ఆరు నెలల క్రితమే అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె ఒంటరిగానే ఉంటోంది. ప్రస్తుతం ఆమె తల్లి నీతాతో కలిసి లక్నోలో చికిత్స పొందుతోంది. బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ, తల్లి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగానే ఉంది.
Follow Us