/rtv/media/media_files/2025/04/22/0aUjdbEdekAtGJjpbHV7.jpg)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్
As an extraordinary Gesture, Saudi Arabia Air Force escorts PM Modi's plane as it enter Saudi airspace till Jeddah. pic.twitter.com/ts1X4CbPiP
— Neetu Khandelwal (@T_Investor_) April 22, 2025
సౌదీకి బయలుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవల 2 దేశాల మధ్య బంధం మరింత దృఢమైందన్నారు. రక్షణ, వాణిజ్య, పెట్టుబడి, ఎనర్జీ రంగాల్లో సహకారం పెరిగిందన్నారు. ప్రాంతీయంగా శాంతి, సామరస్యం, స్థిరత్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు
Royal welcome for PM Modi in the skies of Saudi Arabia .In a grand gesture, Saudi Arabia rolled out an aerial red carpet for PM Modi with fighter jets escorting his aircraft as it entered Saudi airspace & at the same time deported 4786 Pakistani beggars from Saudi Arabia.🇮🇳🇸🇦 pic.twitter.com/J9GTjutX2n
— Baba Banaras™ (@RealBababanaras) April 22, 2025
ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండవ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చక్రవర్తి మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్‌తో జరిగే చర్చల్లో భారతీయ యాత్రికులకు చెందిన హజ్ కోటా గురించి మాట్లాడనున్నారు.
🇮🇳-🇸🇦 friendship flying high!
— Randhir Jaiswal (@MEAIndia) April 22, 2025
As a special gesture for the State Visit of PM @narendramodi, his aircraft was escorted by the Royal Saudi Air Force as it entered the Saudi airspace. pic.twitter.com/ad8F9XGmDL
Landed in Jeddah, Saudi Arabia. This visit will strengthen the friendship between India and Saudi Arabia. Eager to take part in the various programmes today and tomorrow. pic.twitter.com/Y1HNt9J4nG
— Narendra Modi (@narendramodi) April 22, 2025
(saudi-arabia | modi-visit | Air escort)