/rtv/media/media_files/2025/08/23/kukatpally-murder-case-2025-08-23-15-40-47.jpg)
Kukatpally Murder Case
హైదరాబాద్(hyderabad) లోని కూకట్‌పల్లి(kukatpally murder case) లో 12 ఏళ్ల బాలికను పదో తరగతి చదువుతున్న బాలుడు దారుణంగా హత్య చేసిన కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలుడు డబ్బులు దొంగతనం చేయడానికి వెళ్లలేదని, క్రికెట్ బ్యాట్ కోసమే వెళ్లినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన సీపీ బాలిక హత్య ఎలా జరిగిందో వివరించారు. బాలిక తమ్ముడు ఆడుకునే బ్యాట్ నిందితుడికి నచ్చిందన్నారు. దాన్ని దొంగలించడానికి నిందితుడు ఆ బాలిక ఇంటికి వెళ్లాడని సీపీ వెల్లడించారు. ఆ క్రికెట్ బ్యాట్(Cricket Bat) తీసుకొస్తున్న సమయంలో 12 ఏళ్ల బాలిక దొంగ దొంగ అని అరిచిందన్నారు.
సహస్ర హత్య కేసులో పోలీసులకే సలహాలిచ్చిన నిందితుడు.
— RTV (@RTVnewsnetwork) August 23, 2025
సహస్ర హత్య కేసులో పక్కింటి బాలుడే నిందితుడని డీసీపీ తెలిపారు. అతను పోలీసులను తప్పుదోవ పట్టించి, కేసు విచారణలో సలహాలిచ్చాడని చెప్పారు. తమ్ముడి బ్యాట్ కోసం ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు సహస్ర అడ్డురావడంతో చంపేశాడని… pic.twitter.com/KAWicpt53f
ఇది కూడా చూడండి: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఊహించని ట్విస్టులు.. సాక్షులు ఎందుకు మాట మార్చారు ? కారణం అదేనా
ఎక్కువగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌లు చూసేవారని..
ఈ విషయం అందరికి ఎక్కడ చెబుతుందని భయపడి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో బాలికపై విచక్షణా రహితంగా దాడి చేసినట్లు సీపీ అవినాష్ తెలిపారు. నిందితుడు ఎక్కువగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్‌లు చూసేవాడని, వాటి కారణంగానే ఎలా తప్పించుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నట్లు వివరించారు. అయితే హత్య అనంతరం నిందితుడి తల్లికి అనుమానం వస్తే.. ప్రామిస్ వేసి తాను నేరానికి పాల్పడలేదని నమ్మించాడని సీపీ తెలిపారు. నిందితుడు టెర్రస్ నుంచి దూకడంతో వేరే ఫ్లోర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చూశాడన్నారు. తాను చెప్పడంతో క్లూ దొరికిందన్నారు. దీంతో బాలుడి ఇంట్లో దర్యాప్తు చేయగా కత్తి, లెటర్ దొరికాయన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.
ఇది కూడా చూడండి: Kukatpalli Murder Case: వాడిని చంపేయండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న కూకట్‌పల్లి బాలిక తండ్రి ఆవేదన!
బ్యాట్ కొనే పరిస్థితులో లేదని..
కత్తితో చంపేసిన తర్వాత బాలిక ఇంట్లోనే దాన్ని కడిగేశాడు. ఆ తర్వాత నిందితుడు వారి ఇంట్లోకి వెళ్లే ముందు బయట ఆరేసిన షర్ట్ వేసుకొని లోపలికి వెళ్లి స్నానం చేశాడు. వెంటనే బట్టలను కూడా వాషింగ్ మిషన్‌లో వేశాడు. ఇది చాలా టిపికల్ కేసు అని సీపీ అవినాష్ తెలిపారు. అయితే బ్యాట్ కొనే పరిస్థితుల్లో బాలుడు కుటుంబం లేదని బాలుడు భావించి దొంగతనం చేయాలని అనుకున్నాడు. పద్నాలుగేళ్ల వయస్సు కాబట్టి ఆ వయస్సులో అతనికి బ్యాట్ దొంగతనం పెద్ద సమస్యే కాదని అనుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన అనంతరం లెటర్‌ను సెల్ఫ్ పై దాచాడు. పోలీసులు వారికి ఇంటికి వెళ్లి చూడగా అన్ని ఆధారాలు దొరికాయని సీపీ అవినాష్ తెలిపారు.
ఉరిశిక్ష విధించాలని..
12 ఏళ్లు అయిన తన కూతురిని దారుణంగా హత్య చేసిన ఆ బాలుడికి ఉరిశిక్ష విధించాలని బాలిక తండ్రి డిమాండ్ చేశారు.ఆ బాలుడిది పెద్ద క్రిమినల్ మైండ్ అని.. వాడిని చంపేయాలని పోలీసులను కోరాడు.