Breaking: అయ్యో బిడ్డలు.. సంక్రాంతి వేళ సరదాగా డ్యాంలో దిగి ఐదుగురి మృతి!

కొండపోచమ్మ సాగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈత కొట్టేందుకు నీటిలో దిగిన 7గురు యువకుల్లో ఐదుగురు అందులోనే మునిగి చనిపోయారు. మరో ఇద్దరు తృటిలో బయటపడ్డారు. మృతులంతా హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ విచారం వ్యక్తం చేశారు. 

author-image
By srinivas
New Update
Kondapochamma Sagar

Kondapochamma Sagar

Kondapochamma Sagar Reservoir: కొండపోచమ్మ సాగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ కోసం నీటిలో దిగిన 7గురు యువకుల్లో ఐదుగురు అందులోనే ముగిని చనిపోయారు. మరో ఇద్దరు తృటిలో బయటపడ్డారు. మృతులంగా హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

Also Read: లిక్కర్‌ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం.. కాగ్‌ రిపోర్టులో సంచలన విషయాలు

హైదరాబాద్‌కు చెందిన ఈ ఏడుగురు మార్కూర్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో ఈతకొట్టేందుకు వెళ్లారు. నీళ్లలోకి దిగి సరదాగా ఆడుతుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు నీట మునిగి అక్కడిక్కడే మరణించారు. మిగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలియగానే స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!

మృతుల వివరాలు.. 


1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు.
2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు (దనుష్ సోదరుడు)
3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ వయస్సు 17 సంవత్సరాలు. (బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ)
4. సాహిల్ s/o దీపక్ సుతార్ వయస్సు 19 సంవత్సరాలు.
5. జతిన్ s/o గోపీనాథ్ వయస్సు 17 సంవత్సరాలు (ఖైరతాబాద్, చింతల్ బస్తీ)

బయటపడ్డవారు..
1. కొమారి మృగాంక్ s/o వేణుగోపాల్ వయస్సు 17 సంవత్సరాలు. (ముషీరాబాద్ రాంనగర్). 
2. Md ఇబ్రహీం s/o Md హసన్ వయస్సు 20.

Also read: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

 

తెలంగాణ ప్రభుత్వం విచారం.. 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో యువకుల గల్లంతైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన వారికోసం గజ ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితిని జిల్లా అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించాలని, తగిన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

Also Read : 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్స్.. 'పుష్ప2' కన్నా తక్కువ 'దేవర' కంటే ఎక్కువ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు