Athlete: మహిళా అథ్లెట్‌పై 62 మంది లైంగిక దాడి.. 5 ఏళ్లుగా ఆ వీడియోలు చూపిస్తూ!

కేరళలో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల మహిళా అథ్లెట్‌పై 5 ఏళ్లుగా 62 మంది పురుషులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన సంచలనం రేపుతోంది. పతనంతిట్ట జిల్లా పోలీసులు 60 మందిపై ఎఫ్ఐర్ నమోదు చేసి 5గురిని అరెస్ట్ చేశారు.

New Update
Kurnool : సమాజం సిగ్గుపడే ఘటన.. సొంత చెల్లికే ప్రెగ్నెంట్ చేసిన కామాంధుడు!

Kerala  Athlete: దేశంలో మరో దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా అథ్లెట్‌పై 5 సంవత్సరాల పాటు 62 మందికి పైగా పురుషులు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఆమెకు అశ్లీల వీడియోలు చూపించి 18 ఏళ్ల వయసు వచ్చేవరకు రకరకాల పద్ధతిలో ఆమెను వేధించారు కామాంధులు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకోగా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తుండగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

అశ్లీల వీడియోలను బలవంతంగా చూపించి..

కేరళ రాష్ట్రంలోని  పతనంతిట్ట జిల్లాకు చెందిన 13 ఏళ్ల అమ్మాయికి పక్కింటి అబ్బాయి అశ్లీల వీడియోలను బలవంతంగా చూపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలియగానే ఆ బాలికను తన ఇంటికి సమీపంలోని మరికొంత మంది అబ్బాయిలు బెదిరించడం మొదలుపెట్టారు. అలా ఒకరోజు ఆమెను బలవంతంగా ఓ కొండకు తీసుకెళ్లి స్నేహితులతో కలిసి అత్యాచారం చేశారు. అయితే ఇంతకాలం మౌనంగా ఉన్న ఆమె.. కుటుం సభ్యులకు చెప్పడంతో భయంకర నిజాలు బయటపడ్డాయి. పేరెంట్స్ వెంటనే ఈ విషయం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేయడంతో అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కమిటీ పోలీసులను అప్రమత్తం చేసింది.  

62 మంది పురుషులు నేరస్థులు..

పతనంతిట్ట జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులతోపాటు అమ్మాయి కోచ్‌, తోటి క్రీడాకారులను అదుపులోకి తీసుకుని విచారించారు. 62 మంది నిందుతులపై పోలీసులు నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. నిందితులందరినీ పట్టుకునేందుకు పతనంతిట్ట జిల్లా పోలీస్‌ చీఫ్‌ వీజీ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో 62 మంది పురుషులు నేరస్థులుగా గుర్తించబడ్డారు. 40 మంది పురుషులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి. సుబిన్, ఎస్ సందీప్, వీకే వినీత్, కే ఆనందు, శ్రీని అనే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సిడబ్ల్యుసి), పోలీసులు కలిసి ప్రాణాలతో బయటపడిన వారికి అవసరమైన మద్దతు, రక్షణ కల్పించేలా కృషి చేస్తున్నారు. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. ఎలవుంతిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినప్పటికీ నిందితుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఇతర స్టేషన్‌ల అధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: Dil Raju : తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన దిల్ రాజు

ఇక ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉండే అవకాశం ఉందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్యామలా దేవి అన్నారు. 'మేము ప్రస్తుతం వివరాలను సేకరిస్తున్నాం. బాలికను షెల్టర్ హోంకు తరలించారు. తదుపరి సమాచారం రెండు రోజుల్లో వెల్లడిస్తాం' అని ఆమె చెప్పారు.  మరిన్ని ఆధారాలు సేకరించేందుకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కూడా జనవరి 11న బాధితురాలితో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఆ క్రీడాకారిణి మానసిక స్థితి, గోప్యతకు కూడా ప్రాధాన్యతనిస్తున్నాం. ఆమెకు అవసరమైన కౌన్సెలింగ్ సేవలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Heart Attack: గుండెపోటుతో కుర్చీలోనే.. ఈ చిన్నారి విజువల్స్ చూస్తే కన్నీళ్లు ఆగవు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు