Murder: బరితెగించిన భార్య.. భర్తను లేపేసేందుకు ప్రియుడికి రూ.20 లక్షల సుపారీ!

ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌కు రూ.20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

New Update
Khammam Dharma Rao murder case

Khammam Dharma Rao murder case

Murder:ఖమ్మం ధర్మారావు హత్య కుట్ర కేసును పోలీసులు ఛేదించారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే భార్య, ప్రియుడు రాము కలిసి ఓరౌడీ గ్యాంగ్‌తో 20 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు నిందితుల నుంచి ఓ ఎయిర్ గన్ సహా రెండు కత్తులు, ఓకారు, 90 వేల నగదు, 5సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

Also Read: Musk-Trump: ట్రంప్ మీటింగ్‌లో మస్క్ "టాప్ సీక్రెట్" నోట్..అసలు అందులో ఏముంది!

ప్రియురాలి భర్తను అడ్డుతొలగించాలని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే ప్రియురాలి భర్తను అడ్డుతొలగించాలనుకున్న  కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము హత్యకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామానికి చెందిన తోట ధర్మారావు హత్యకు సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓరౌడీ గ్యాంగ్ తో 20 లక్షలకు సుపారీ కుదుర్చుకుని 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు. అనుకున్న పథకం ప్రకారం గత నెల మార్చి 12 న ధంసలాపురం వద్ద తోట ధర్మారావును కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. అనంతరం సుపారీ ఇచ్చిన రాముకు వీడియో కాల్ చేసి కిడ్నాప్ చేసిన వ్యక్తిని తోట ధర్మారావుగా నిర్థారించుకున్న సుపారీ గ్యాంగ్.. మరింత డబ్బు డిమాండ్ చేసింది. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

హత్యచేయకుండా వదిలేయడంతో..

అయితే రాము స్పందించకపోవడంతో విసుగుచెందిన సుపారీ గ్యాంగ్.. లక్షాయాభైవేల రూపాయల నగదు, బంగారు గొలుసు తీసుకుని బాధితుడు తోట ధర్మారావును హత్యచేయకుండా వదిలేసింది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో చర్చించి విషయాన్ని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు ధర్మారావు. దీంతో వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన నగర ఏసీపీ రమణమూర్తి.. ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడితోటలో సుపారీ గ్యాంగ్ సమావేశమయ్యారన్న సమాచారంతో రంగంలోకి దిగారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

ప్రధాన నిందితుడు కొండూరి రామాంజనేయులు అలియాస్ రాము, దంతాల వెంకట్ నారాయణ అలియాస్ వెంకట్ సుపారీ గ్యాంగ్ సభ్యులు పగడాల విజయ్ కుమార్ అలియాస్ చంటి, వేముల కృష్ణ, బుర్రి విజయ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 

Also Read: సన్‌రైజర్స్ Vs కింగ్స్ మ్యాచ్.. ఈ అద్భుతాలు చూశారా..? అస్సలు ఊహించలేరు!

 husband | wife | lover | murder-case | telugu-news | today telugu news 

Advertisment
తాజా కథనాలు