/rtv/media/media_files/2025/10/03/kerala-man-gets-22-years-rigorous-imprisonment-sexually-assaulting-toddler-2025-10-03-18-33-27.jpg)
kerala man gets 22 years rigorous imprisonment sexually assaulting toddler
కేరళ(kerala)లోని తిరువనంతపురంలో ఒక నిందితుడికి కఠిన శిక్ష పడింది. 18 నెలల బాలికను కిడ్నాప్(baby-kidnap) చేసి, ఆమెను దారుణంగా హింసించినందుకు అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అదే సమయంలో శిక్షతో పాటు.. నిందితుడికి రూ.72,000 భారీ జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : బీహార్ లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు స్పాట్!
18 నెలల బాలికపై అత్యాచారం
అతడి పేరు హసన్ కుట్టి అలియాస్ కబీర్. అతడికి 41 ఏళ్లు. అయిరూర్ సమీపంలోని ఎడవ నివాసి. హసన్ కుట్టి పై ఇప్పటికే ఎనిమిది క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. గతంలో అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. 2022లో హసన్ కుట్టి ఓ చిన్నారిని వేధింపులకు గురి చేసినందుకు అయిరూర్ పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు(sexual assault case) నమోదైంది. అనంతరం గత ఏడాది అంటే 2024లో మరో చిన్నారిపై అత్యాచారం(minor-girl-raped) చేశాడు.
హైదరాబాద్‌కు చెందిన దంపతులు తమ 18 నెలల కూతురితో కలిసి బతుకుతెరువు కోసం కేరళకు వెళ్లారు. తిరువనంతపురంలోని చక్కాలో రోడ్డు పక్కన నివసించేవారు. ఫిబ్రవరి 19, 2024న రాత్రి సమయంలో ఆ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. అదే సమయంలో నిందితుడు హసన్ మెల్లగా వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఆ బాలికను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి ఆ చిన్నారిని తీసుకుని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనుక ఉన్న రైల్వే పట్టాల దగ్గరకు తీసుకుని పారిపోయాడు.
అక్కడ ఏకాంతంగా ఎవరూ లేని ప్లేస్‌కు తీసుకెళ్లి ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆ చిన్నారి స్పృహ తప్పి పడిపోవడంతో.. ఆమె చనిపోయిందనుకుని పక్కనే ఉన్న పొదల్లో విసిరేసాడు. ఉదయం కాగానే ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు మరుసటి రోజు సాయంత్రం వరకు వెతకగా.. ఆమె పొదల్లో అపస్మారక స్థితిలో కనిపించింది.
ఆ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఆమె ప్రాణాలతో బయటపడింది. అనంతరం నిందితుడిని గుర్తించడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడ్డారు. దాదాపు 100 కి పైగా సిసిటివి కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరికి పోలీసులు రెండు వారాల తర్వాత కొల్లంలోని చిన్నక్కడ ప్రాంతంలో అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ దాదాపు నాలుగు నెలల కొనసాగగా.. చివరికి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.పి. శిబు.. నిందితుడు హసన్ కుట్టికి 22 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.
Also Read : అమ్మాయి నచ్చితే ప్రత్యేక గది, సెల్ ఫోన్..ఢిల్లీ బాబా మహిళా సహాయకులు అరెస్ట్