Telangana : కిడ్నాప్ అయిన 9 నెలల చిన్నారి సేఫ్.. నిందితురాలు అరెస్టు..
హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో కిడ్నాప్ అయిన పాపను పోలీసులు రక్షించారు. ఆ చిన్నారి ఇంట్లో కేర్‌టేకర్‌గా చేరిన షాజహాన్ అనే మహిళ.. ఆ పాప తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎత్తుకెళ్లింది. ఎంజీబీఎస్‌లో జహీరాబాద్ బస్సు ఎక్కిన ఆమెను పోలీసులు పట్టుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.