Bihar Train Accident : బీహార్ లో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు స్పాట్!

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.పూర్ణియలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పూర్ణియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు.

New Update
bihar

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.పూర్ణియలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పూర్ణియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితులు దసరా ఉత్సవం నుండి తిరిగి వస్తుండగా, జోగ్బానీ-దానపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కతిహార్-జోగ్బానీ రైల్వే లైన్‌లో వారిని ఢీకొట్టింది. బీహార్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి వారం రోజుల వ్యవధిలో ఇది రెండవ సంఘటన. సెప్టెంబర్ 30న సహర్సాలోని హతియాగాచి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఒక వృద్ధుడు మరణించాడు.

మరణించిన వారంతా యువకులు (సుమారు 18-25 సంవత్సరాల మధ్య వయస్సు వారు) అని తెలుస్తోంది. వీరంతా దసరా ఉత్సవాల్లోని సాంస్కృతిక కార్యక్రమాలు చూసి కాలినడకన ఇంటికి తిరిగి వెళ్తుండగా రైలు పట్టాలు దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరు పూర్ణియాలోని ఒక మఖానా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. నలుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జోగ్‌బానీ (అరారియా) నుండి దానాపూర్ (పాట్నా) వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వీరిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

కాగా డిసెంబరు 17న ప్రారంభించబడిన జోగ్బాని-దానాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జోగ్‌బాని నుండి తెల్లవారుజామున 3:25 గంటలకు బయలుదేరి, తెల్లవారుజామున 4:50 గంటలకు పూర్నియాలో ఆగి, సహర్సా, ఖగారియా, సమస్తిపూర్, ముజఫర్‌పూర్ మీదుగా దానాపూర్, పాట్నా, సుమారు 11:30 గంటలకు చేరుకుంటుంది.

Also read : Sana Mir : వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్

Advertisment
తాజా కథనాలు