/rtv/media/media_files/2025/03/03/0OAKocbccEZCdlqQqZvw.jpg)
Baby
శిశువును చూసుకోవాల్సిన తల్లి బావిలో పడేసిన దారుణ ఘటన సిద్ధిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన శ్రీమాన్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం కవితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండు నెలల కిందట కుమారుడు జన్మించాడు. అయితే పని ఉండటం వల్ల రుద్రారంలోని అక్క వద్దకు వీరు వెళ్లారు. అక్కడ కవిత సాయంత్రం పూట బిడ్డను ఎత్తుకొని బయట నిలబడింది.
ఇది కూడా చూడండి: BIG BREAKING: రేవంత్ రెడ్డికి బిగ్‌షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్
కవిత భర్తకు చెప్పి..
ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చారు. శ్రీమాన్ భార్య మీరేనని అడిగి శిశువును ఎత్తుకెళ్లిపోయారు. దీంతో వెంటనే కవిత భర్తకు చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇదంతా తల్లి చెప్పిన స్టోరీ. కానీ పోలీసులు విచారణలో తల్లే బిడ్డను చంపినట్లు తేలింది. గ్రామంలోని ఓ బావిలో పడేసి తెలియని దుండగులు ఎత్తుకెళ్లారని ప్లాన్ వేసినట్లు పోలీసులు విచారణలో ఒప్పకుంది. వెంటనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!
ఇదిలా ఉండగా ఇటీవల ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వెస్ట్ బెంగాల్‌లో జరిగింది. "అమ్మా, నేను దొంగతనం చేయలేదు" అంటూ 13ఏళ్ల బాలుడు రాసిన సూసైడ్ నోట్ అందరి మనసులను కలచివేసింది. చేయని దొంగతనం తనపై మోపారనే అవమానంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో జరిగింది.
ఇది కూడా చూడండి: Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక
కృష్ణేందు అనే 13 ఏళ్ల బాలుడు బకుల్డా హైస్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం గోసైన్‌బర్ మార్కెట్‌లోని ఓ షాప్ యజమాని శుభాంకర్ దీక్షిత్.. కృష్ణేందు తన షాపు నుంచి మూడు చిప్స్ ప్యాకెట్లను దొంగిలించాడని ఆరోపణలు చేశాడు. స్థానికులు కూడా కృష్ణేందు చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాడని ఆరోపించారు. దీంతో షాప్ యజమాని శంభాకర్ కృష్ణేందును కొట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పమని బలవంతం చేశాడు. చేయని తప్పుకు అవమాన పాలు కావడంతో ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.
ఇది కూడా చూడండి: Israel Couple: కొన్ని రోజుల్లో నిశ్చితార్థం..అంతలోనే ఉగ్రవాదుల చేతుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి
siddhipet | Latest crime news