/rtv/media/media_files/2025/10/14/woman-commits-suicide-after-killing-two-children-2025-10-14-08-24-34.jpg)
Woman commits suicide after killing two children
Hyderabad Crime News: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపిన తల్లి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. బాలానగర్ పీఎస్ పరిధి పద్మానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి ఆమె దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలానగర్ పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి సాయిలక్ష్మీ, అనిల్ కుమార్ దంపతులు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను చంపి తల్లి సాయిలక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
కుటుంబ కలహాల కారణంగా రెండు సంవత్సరాల కవలపిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లిను తల్లి చల్లారి సాయిలక్ష్మీ(27) హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం తాను బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొన్నిరోజులుగా కుటుంబంలో భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో సాయిలక్ష్మీ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ఆమె తన కవల పిల్లలను గొంతు పిసికి చంపి, ఆ తర్వాత బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవడం మానసిక ఒత్తిడికి, కుటుంబ కలహాల తీవ్రతకు ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో ప్రాణాలు పోతున్నాయి. కుటుంబసభ్యులకు వారి లేని లోటు తీర్చలేనిది. అయితే ఇంట్లో ఎవరైనా డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడుతుంటే వారితో మాట్లాడాలి. ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించడానికి, వారితో మాట్లాడేందుకు కుటుంబసభ్యులు చొరవ తీసుకోవాలి. ఆత్మహత్య కేసులు పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా స్థానికులు ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.సాయిలక్ష్మి స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడుగా గుర్తించారు.
Also Read : జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఊహించని షాక్.. 300 మంది మాలల నామినేషన్లు!