IT Employees Accident: మరణంలోనూ వీడని స్నేహం.. ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం!

హైదరాబాద్‌ రింగురోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. చిరకాల మిత్రులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన భానుప్రకాశ్‌, బిశ్వాల్‌ ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు.

New Update
hyde acdnt

Hyderabad road accident friends died

IT Employees Accident: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చిరకాల మిత్రులను రోడ్డు ప్రమాదం ఒకేసారి కబలించింది. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగం చేసుకుంటూ ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న స్నేహితులు ఆదివారం తెల్లవారుజామున దుర్మరణం చెందడం కలకలం రేపింది. ఒకే కారులో ప్రయాణిస్తూ అనంతలోకాలకు చేరిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరగగా జనాలను కంటతడిపెట్టిస్తోంది. ఈ మేరకు ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Also Read: Israel: సైన్యం తప్పువల్లే ఆ మరణాలు.!

కారు కంట్రోల్ తప్పి..

ఒడిశాలోని జైపుర్‌కు చెందిన భానుప్రకాశ్‌(36), రావుర్కెలాకు చెందిన నళినికంఠ బిశ్వాల్‌(37)ఒకే కాలేజీలో చదువుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ రాజేంద్రనగర్‌ మంచిరేవులలోని యునైటెడ్‌ అమిగో అవెన్యూ అపార్ట్‌మెంట్‌లోని వేర్వేరు ఫ్లాట్లలో నివాసం ఉంటున్నారు. అయితే శనివారం రాత్రి వారిద్దరూ బయటకెళ్లి ఆదివారం తెల్లవారుజామున ఇంటికి వస్తుండగా పటాన్‌చెరు అవుటర్‌ రింగ్‌రోడ్డు మల్లంపేట 4ఏ ఎగ్జిట్‌ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కంట్రోల్ తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం పంపించారు. 

Also Read: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం బిశ్వాల్‌ ఐఫోన్‌ ద్వారా అతని భార్య సునైనాకు అందింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ  అపార్ట్‌మెంట్‌ వాసులు కన్నీటిపర్యంతమయ్యారు. భానుప్రకాశ్, సాయిలక్ష్మి దంపతులకు మూడేళ్ల కూతురు ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 


Also Read: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

Also Read:  Tirumala: తిరుమలకు వచ్చే వారు అలా చేయడం మంచి పద్దతి కాదు.. !

 ring-road | car-accident | friends | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు