Hyderabad: జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం.. తండ్రి, కొడుకు బలి

హైదరాబాద్‌ లంగర్ హౌస్‌లోని హుడా పార్క్ చెరువు శుభ్రం చేస్తుండగా తండ్రి, కొడుకు బురదలో ఇరుక్కుపోయి మృతిచెందారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఎమ్మెల్యే కౌసర్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా చేస్తామన్నారు.

New Update
Hyderabad Lunger house

Hyderabad Lunger house Photograph: (Hyderabad Lunger house)

జీహెచ్ఎంసీ (GHMC) అధికారుల నిర్లక్ష్యం వల్ల తండ్రి, కొడుకు బలైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ లంగర్ హౌస్‌లోని హుడా పార్క్ చెరువు శుభ్రం చేస్తుండగా ఇద్దరు అవుట్ సోర్సింగ్ సిబ్బంది మృతి చెందారు. వీరిద్దరూ కూడా తండ్రి, కొడుకులు. లంగర్ హౌస్‌ (Lunger House) లోని హుడా పార్క్‌లో చెరువు శుభ్రం చేయడానికి మహమ్మద్ కరీం తన కొడుకుని తీసుకుని వెళ్లాడు.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

గడ్డిని శుభ్రం చేస్తుండగా..

చెరువులోని గడ్డిని శుభ్రం చేస్తుండగా బురదలో ఇరుక్కున్నాడు. కొడుకుని కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా అదే బురదలో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. సిబ్బంది వెంటనే గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే డిఆర్ఎఫ్‌టీం ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలను బయటకు వెలికి తీశారు. 

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

ఎమ్మెల్యే కౌసర్ మోయుద్దిన్ ఈ క్రమంలో మాట్లాడుతూ జీఎచ్‌ఎంసీపై మండిపడ్డారు. ఎఫ్టిఎల్ మెషిన్ ఎన్నోసార్లు అడిగామని, కానీ కమిషనర్ ఏదో సాకు చెప్పి ఇచ్చే వారు కాదని తెలిపారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి కనీసం ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్, లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. గవర్నమెంట్, జీహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చేలా చేస్తామన్నారు. 15 ఏళ్ల కుర్రాడు పనికి వెళ్లేలా సూపర్వైజర్ పర్మిషన్ ఎలా ఇస్తారని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు