Hyderabad: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. తండ్రిని చంపి ఆ తర్వాత సెకండ్‌షోకి!

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని హైదరాాబాద్‌లో ఓ కూతురు తండ్రిని చంపింది. తన తల్లి, ప్రియుడు సాయంతో అతన్ని చంపి చెరువులో పడేసి, ఆ తర్వాత సెకండ్ షోకి వెళ్లారు. చెరువులో శవం కనిపించి విచారణ చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
CRIME

CRIME

ఈ మధ్య కాలంలో వివాసేతర సంబంధాలకు అడ్డు వస్తున్నారని చంపుతున్న ఘటనలు ఎక్కువ అయ్యాయి. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో మరొకటి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగం పాతబస్తీలోని భార్యాభర్తలు ఉంటున్నారు. వీరిలో జీహెచ్‌ఎంసీలో భార్య స్వీపర్‌గా పనిచేస్తుండగా భర్త సెక్యూరిటీ గార్డు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్ద అమ్మాయికి పెళ్లి అయ్యింది.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని..

తన భర్త స్నేహితుడితో సంబంధం ఉండటంతో ఆమెను వదిలేశాడు. ఇప్పుడు మనీషా తన భర్తతో ఉండకుండా లవర్‌తో ఉంటుంది. ఇది నచ్చని తండ్రి చాలా సార్లు తనతో గొడవపడ్డాడు. అలాగే భార్యను కూడా అనుమానిస్తున్నాడని కూతురుకి తల్లి చెప్పింది. దీంతో తల్లి, బాయ్ ఫ్రెండ్ సాయంతో తండ్రిని చంపడానికి రెడీ అయ్యింది.

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

తండ్రి తాగే కళ్లులో నిద్రమాత్రలు కలిపింది. ఆ తర్వాత దిండు సాయంతో ఊపిరి ఆడకుండా చంపేశాడు. ఇక సెకండ్ షో సినిమాకి వెళ్లి క్యాబ్ బుక్ చేశారు. డ్రైవర్‌కి అనుమానం వచ్చి అడిగితే.. ఫుల్‌గా తాగారని, మత్తులో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఎదులాబాద్ దగ్గర దిగి.. తీసుకెళ్లి చెరువులో పడేశారు. 

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

చెరువులో శవం కనిపించడంతో దర్యాప్తు చేపట్టగా విషయం వెలుగులోకి వచ్చింది. చెరువు దగ్గర సీసీ కెమెరాలను చెక్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టగా తల్లి, ప్రియుడు సాయంతో కూతురు తండ్రిని చంపినట్లు గుర్తించారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు