Blinkit: ఆన్‌లైన్‌లో ఆయుధాలు ఆర్డర్.. మర్డర్ కేసులో బ్లింకిట్‌పై కేసు

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్ వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఆయుధాల జాబితాలోని బటన్ కత్తులను ఆన్‌లైన్‌లో అమ్మినందుకు ఢిల్లీ పోలీసులు ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కత్తులు రెండు హత్య కేసుల్లో వాడటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
Blinkit

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం బ్లింకిట్(blinkit) వివాదంలో చిక్కుకుంది. నిషేధిత ఆయుధాల జాబితాలో ఉన్న ప్రమాదకరమైన బటన్ కత్తులను ఆన్‌లైన్‌లో అమ్మినందుకు ఢిల్లీ పోలీసులు(delhi-police) ఆ సంస్థపై కేసు నమోదు చేశారు. ఈ కత్తులు రెండు వేర్వేరు హత్య కేసుల్లో వాడినట్లు తేలడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన రెండు వేర్వేరు హత్య కేసులను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పట్టుబడిన నిందితులను విచారించగా, వారు హత్యకు వాడిన కత్తులను ఆన్‌లైన్ డెలివరీ యాప్ బ్లింకిట్‌(delivering knives) లో ఆర్డర్ చేసినట్లు అంగీకరించారు. సాధారణంగా బటన్ కత్తులు నేరాలకు వాడే అవకాశం ఉన్నందున వాటి అమ్మకంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే, బ్లింకిట్ వంటి స్పీడ్ డెలివరీ ప్లాట్‌ఫాంలలో ఇవి సులభంగా లభించడంపై పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. 

Also Read :  పెళ్లి వేడుకలో వధువుపై రూ.8 కోట్ల నోట్ల వర్షం ? వీడియో వైరల్..

Case Registered Against Blinkit

పోలీసుల కథనం ప్రకారం, నిందితులు కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే ఈ కత్తులను హోమ్ డెలివరీ తీసుకున్నాడు. "చాకులు లేదా గృహోపకరణాల" కేటగిరీ కింద వీటిని విక్రయించినట్లు తెలుస్తోంది. రెండు హత్యల్లోనూ ఈ కత్తులే మరణానికి ప్రధాన కారణమని పోస్ట్‌మార్టం నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు ధృవీకరించాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు, నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదకర ఆయుధాలను విక్రయించినందుకు బ్లింకిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద, అజాగ్రత్తగా ప్రాణాంతక వస్తువులను పంపిణీ చేసినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్లాట్‌ఫాంపై ఏ వస్తువులు అమ్ముతున్నారనే దానిపై సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ నేరాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఈ కత్తులను సప్లై చేస్తున్న వెండర్లు ఎవరు? నిబంధనలకు విరుద్ధంగా వీటిని లిస్ట్ చేయడానికి అనుమతించిన అధికారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్, క్విక్ కామర్స్ సంస్థలు అమ్ముతున్న వస్తువుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కూరగాయలు, నిత్యావసరాలు డెలివరీ చేసే యాప్‌లలో ఇలాంటి మారణాయుధాలు లభించడం సామాజిక భద్రతకు ముప్పుగా పరిణమించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆన్‌లైన్ వెబ్‌సైట్లపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read :  పాక్, చైనాకు చుక్కలే.. ఫ్రాన్స్‌తో భారత్‌ సంచలన ఒప్పందం

Advertisment
తాజా కథనాలు