Shreyasi Singh : షూటర్కు మోడీ మంత్రి పదవి... ఎవరీ  శ్రేయాషి సింగ్?

బీజేపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాషి సింగ్ కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఈమె షూటర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఈమె ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె.

New Update
singh modi

బీహార్‌లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది.పాట్నాలోని గాంధీ మైదానంలో నితీష్ కుమార్ 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ఖాన్‌ ఆయన చేత ప్రమాణం చేయించారు. నితీష్ తో పాటు బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా బీహార్ డిప్యూటీ సిఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రులుగా 26 మంది ప్రమాణం చేశారు. బీజేపీ (14), జేడీయూ (8), ఎల్జేపీ (రామ్‌విలాస్‌) (2), హిందుస్థానీ అవామీ మోర్చా (1), రాష్ట్రీయ లోక్‌ మోర్చా (1) ప్రమాణం చేశారు.  ఇందులో  ఐదుగురు మొదటిసారి మంత్రలయ్యారు. కేబినెట్ లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వారిలో లేషి సింగ్, రమా నిషాద్, శ్రేయాషి సింగ్ ఉన్నారు. 

తొలిసారి మంత్రి పదవి

ఇందులో బీజేపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రేయాషి సింగ్ కు తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఈమె షూటర్ నుండి రాజకీయ నాయకురాలిగా మారారు. ఈమె ఎవరో కాదు కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. ఆమె తాత కుమార్ సురేంద్ర సింగ్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడా. ఆమె తల్లి పుతుల్ కుమారి, మాజీ ఎంపీ.  2020లో బీజేపీలో చేరిన శ్రేయాషి సింగ్ ..  జముయి నియోజకవర్గం నుండి పోటీ చేసి, RJD అభ్యర్థి విజయ్ ప్రకాష్‌ను 41,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఇక 2025లో RJD అభ్యర్థి మొహమ్మద్ షంషాద్ ఆలంను ఓడించారు. అయితే ఈమెకు ఏ మంత్రి పదవి ఇస్తారన్నది చూడాలి. 

శ్రేయసి సింగ్‌ అంతర్జాతీయ స్థాయిలో ట్రాప్ షూటింగ్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో రజత పతకం, 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది.

Advertisment
తాజా కథనాలు