BIG BREAKING : బంగ్లాదేశ్ కు బిగ్ షాక్.. మోడీ సర్కార్ సంచలన నిర్ణయం

బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహారం( ప్యాక్డ్ ఫుడ్స్), ఇతర వస్తువుల దిగుమతిపై భారత్ పోర్టు ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే  పరిమితం చేసింది.

author-image
By Krishna
New Update
Bangladesh Imposes Port

Bangladesh Imposes Port

బంగ్లాదేశ్ నుండి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు వంటి కొన్ని వస్తువుల దిగుమతిపై భారత్ శనివారం పోర్టు ఆంక్షలు విధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఈ విషయంలో నోటిఫికేషన్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వస్త్ర దిగుమతులను కోల్‌కతా, ముంబై ఓడరేవులకు వరకే  పరిమితం చేసింది. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పోర్ట్ పరిమితులు నేపాల్, భూటాన్‌లకు భారత్ గుండా రవాణా చేసే బంగ్లాదేశ్ వస్తువులకు వర్తించవని స్పష్టం చేసింది.అయితే బంగ్లాదేశ్ నుండి చేపలు, ఎల్‌పిజి, తినదగిన నూనె, క్రష్డ్ స్టోన్ దిగుమతికి పోర్ట్ ఆంక్షలు వర్తించవు. భారత్‌ - పాకిస్తాన్‌ యుద్ధంలో పాక్‌కు మద్దతుగా బంగ్లా నిలువడంతోనే భారత్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ బాధ్యతలు చేపట్టాక రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.  ఇటీవల చైనా పర్యటనలో ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు