/rtv/media/media_files/2025/07/10/shool-girl-2025-07-10-09-09-47.jpg)
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చాలా దారుణంగా వ్యవహరించింది. స్కూల్ లో 5 వ తరగతి నుంచి 10 తరగతులు చదువుతున్న బాలికలను పీరియడ్స్‌లో ఉన్నారో లేదో తెలుసుకోడానికి బట్టలు విప్పి వ్యక్తిగత అవయవాలను టచ్ చేస్తూ చెక్ చేయించారు. ఆలస్యంగా వచ్చిన ఈ ఘటనలో ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : హైదరాబాద్ లో యాసిడ్, కెమికల్స్ తో పాలు.. ఆ ఎరియాల్లో అమ్మకాలు.. షాకింగ్ వీడియోలు!
ఇంతకీ ఏం జరిగిందంటే
పట్టణంలోని ఆర్ఎస్ దమాని పాఠశాలలో టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా అందులో నెలసరి రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అందులో పనిచేసే స్టాఫ్ వాటిని ఫొటోలు తీసి స్కూల్ ప్రిన్సిపల్‌కు పంపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ ప్రిన్సిపల్ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్‌కు పిలిపించారు. వారికి ప్రొజెక్టర్ ద్వారా స్క్రీనింగ్ చేసి ఆ ఫొటోలు చూపించి ఇప్పుడు పీరియడ్స్‌లో ఉన్నవారు, లేనివారు రెండు గ్రూప్‌లుగా విడిపోవాలని ఆదేశించారు.
Also Read : భూవివాదంలో నటి శిల్పా చక్రవర్తి.. ఎస్సై కి నోటీసులు
దీంతో నెలసరి ఉన్నవాళ్లంతా ఒకవైపు, లేనివాళ్లంతా మరోవైపు నిలుచుని ఉన్నారు. అప్పటికీ నమ్మని ఆ ప్రిన్సిపల్.. మహిళా అటెండెంట్‌ను పిలిపించి పీరియడ్స్‌లో లేమని చెబుతున్న విద్యార్థులను చెక్ చేయమని చెప్పారు. దీంతో ఆ మహిళ వారందరినీ వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి వారి వ్యక్తిగత అవయవాలను చెక్ చేసి నెలసరిలో ఉన్నారో, లేరో నిర్దరించారు.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నా ఫస్ట్ లవ్ అతడితోనే: అనుష్క ఓపెన్
ఇదే విషయాన్ని బాలికలు ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కూల్ ఎదుట వారు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులతో సహా ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని.. పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ ముఖేష్ ధాగే తెలిపారు.
Also Read : మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 40 మంది మృతి!
telugu-news | girls | menstruation | school | maharashtra