Period Cramps : ఆ సమయంలో నొప్పి వేధిస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..!!
నెలసరి అనేది మహిళలకు ఒక గండం లాంటిది. ఆ సమయంలో మహిళలు తరచుగా పొత్తికడుపు ప్రాంతంలో విపరీతమైన నొప్పిని అనుభవిస్తుంటారు. పీరియడ్స్ తిమ్మిరి గర్భాశయ గోడల కండరాల సంకోచం వల్ల గర్భాశయ కణజాలానికి ఆక్సిజన్ చేరుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు ఈ నొప్పి ఏర్పడుతుంది. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా, పీరియడ్స్ సమయంలో అసౌకర్యం కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఔషధాలను తీసుకునే బదులు, పీరియడ్స్ క్రాంప్ నుండి ఉపశమనం పొందడానికి మీరు కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలను ప్రయత్నించవచ్చు.