/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
Mother's affair son commits suicide
మంచిర్యాల జిల్లా(Mancherial District) లో దారుణం చోటు చేసుకుంది. తల్లి(Mother) వివాహేతర సంబంధం(Illegal Affair) తో కొడుకు బలయ్యాడు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ గడ్డిమందు తాగి చనిపోయాడు. దీనికి కారణం తల్లి అక్రమ సంబంధమేనన బంధువులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ తల్లి రాజేశ్వరి అదే గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
Also Read:సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు
Mother's Affair Son Commits Suicide
తల్లి అక్రమ సంబంధంపై అనిల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగి అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. అనిల్ మృతితో స్వగ్రామం గంగారంలో ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహానికి గురైన అనిల్ బంధువులు తిరుపతి ఇంటిని ధ్వంసం చేశారు. అనంతరం అనిల్ మృతదేహాంతో తిరుపతి ఇంటి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు. తిరుపతి ఇళ్లు ధ్వంసం చేసేందుకు బంధువులు ప్రయత్నించడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
విషయం తెలుసుకున్న పోలీసులు భారీ ఎత్తున గ్రామంలో మోహరించారు. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే తల్లితో తిరుపతికి ఉన్న అక్రమ సంబంధం విషయం తెలిసి అనిల్ తిరుపతిని నిలదీశాడని తెలిసింది. దీంతో అనిల్ ను చంపేస్తానని తిరుపతి బెదిరించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తిరుపతి బెదిరింపులతో పాటు తల్లి తీరు మనస్తాపానికి గురైన అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు అనిల్ తన మరణ వాంగ్మూలంలోనూ తాను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం తిరుపతి అని చెప్పినట్లు బంధువులు అంటున్నారు. అనిల్ మృతదేహంతో తిరుపతి ఇంటివద్దకు పెద్ద ఎత్తున బంధువులు చేరుకోవడంతో తిరుపతి ఇంటినుంచి పారిపోయాడు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: మావోయిస్టు అగ్రనేతకు నోటీసులు..ఇంటికి అంటించిన పోలీసులు