వై.ఎస్.వివేకా కూతురు సునీత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కడప ఎస్పీని ఆమె కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే తన తండ్రి హత్య మళ్లీ గుర్తొస్తోందన్నారు. నాన్నను గొడ్డలి పోటుతో చంపి..గుండెపోటు అని చెప్పారని ఆరోపించారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచేశాన్నారు. హత్య తర్వాత ఓ లెటర్ తీసుకువచ్చి సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హత్య చేశారని సంతకం పెట్టామన్నారన్నారు. కానీ తాను అందుకు ఒప్పుకోలేదన్నారు. అవినాష్ రెడ్డి అనుచరులు ఆ టైంలో పోలీసులను బెదిరించారన్నారు. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే జరుగుతోందన్నారు. సురేష్ అనే వ్యక్తి తమ బంధువన్నారు. సురేష్‌పై అవినాష్ అనుచరులే దాడి చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా వివేకా హత్య కేసుపై పోరాడుతూనే ఉన్నానన్నారు. అయినా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదన్నారు. వివేకాను సునీతా, రాజశేఖర్ రెడ్డి చంపేశారని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు నిందితులు బయటే తిరుగుతున్నారన్నారు. రేపు వివేకా పుట్టినరోజు, నన్ను పులివెందుల రావొద్దని తన తల్లి చెబుతోందన్నారు.
ఇరు వర్గాలపై కేసులు..
ఇదిలా ఉంటే.. జగన్ ఇలాకా పులివెందులలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, రాఘవ రెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మురళి మాట్లాడుతూ.. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్బంగా పులివెందుల చుట్టూ మూడు చెక్ పోస్టు లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల పరిధిలో మరో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థుల ప్రచారంలో పోలీసు భద్రత కల్పిస్తున్నామన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతోనే నల్లగొండువారిపల్లెలో ఘర్షణ జరిగిందన్నారు.
టీడీపీ కార్యకర్త ధనుంజయ ఫిర్యాదుతో వైసీపీ నేతలు రామలింగారెడ్డి, హేమాద్రి రెడ్డితో పాటు మరి కొందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత రామలింగా రెడ్డి ఫిర్యాదుతో టీడీపీ నేతలపై కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలపై కేసు నమోదు చేశామన్నారు. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, చిన్నప్ప, బయపు రెడ్డి, ఎంపీ రాఘవ రెడ్డితో పాటు మరో 150 మందిపై కేసు నమోదు చేశామన్నారు. టీడీపీ నేత విశ్వనాధ్ రెడ్డి ఫిర్యాదుతో వైఎస్ భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి, ఎంపీ పీఏ రాఘవ రెడ్డి, గంగాధర్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
BIG BREAKING: పులివెందులలో ఏం జరుగుతోందంటే?.. వై.ఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు!
వై.ఎస్.వివేకా కూతురు సునీత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కడప ఎస్పీని ఆమె కలిశారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనలు చూస్తే తన తండ్రి హత్య మళ్లీ గుర్తొస్తోందన్నారు. నాన్నను గొడ్డలి పోటుతో చంపి..గుండెపోటు అని చెప్పారని ఆరోపించారు.