TG Crime: ఈ తరం పిల్లలు త్వరగా డబ్బు సంపాదించాలనే గోల్‌తో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు విఫలం అవుతాయి. ఇలాంటి వాటిల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ ఒకటి. ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో ఎన్నో రకాల మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఆన్‌లైన్ బెట్టింగ్, తీసుకునే అప్పు డబ్బులు కట్టలేక ఏకంగా కుటుంబమే ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం రేపతోంది. గడ్డిమందు తాగి ఆత్మహత్య: వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేట గ్రామంలో సముద్రాల మొండయ్య, శ్రీదేవి నివసిస్తున్నారు. విరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు శివకుమార్, దివ్యంగురాలైన కూతురు చైతన్య ఉన్నారు. కుమారుడు శివకుమార్ ఆన్‌లైన్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనేక రకాలుగా అప్పులు చేశాడు. వీటిలో లాభం రాకపోగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా? దీంతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. అప్పు ఇచ్చినవాళ్లు డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టడంతో అప్పులు తీర్చలేక మనస్థాపంతో చెందిన కుటుంబం. మొండయ్య, శ్రీదేవి, శివకుమార్, చైతన్య మంగళవారం తెల్లవారుజామున గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ మొండయ్య, చైతన్య, శ్రీదేవి, శివకుమార్ మృతి చెందారు. కుటుంబంలోని నలుగురు మృతి చెందడంతో సమీప బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు మొండయ్య బావమరిది కోలేటి రమేష్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: కూతురు ఫోన్.. కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి ఇది కూడా చదవండి: 74 ఏళ్లు పూర్తిచేసుకున్న తలైవా.. బర్త్ డే స్పెషల్ ఇది కూడా చదవండి: పాలలో ఖర్జూరం కలిపి తాగితే ఇన్ని లాభాలా.. ఈ ఆరోగ్య రహస్యం ట్రై చేయండి