Dharmasthala Case: భయంకరమైన ఆరోపణలు.. మృతదేహాలు పాతిపెట్టమన్నది వాళ్లే..!

కర్ణాటకలోని ధర్మస్థల కేసులో ప్రధాన సాక్షి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మృతదేహాలు పూడ్చిపెట్టమని తనని ఆలయ పెద్దలే ఆదేశించారని చెప్పాడు. తాను చేసిన భయంకరమైన పనుల వెనుక ఆలయ పెద్దల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.

New Update
Dharmasthala case

Dharmasthala case

కర్ణాటక(Karnataka) లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల(Dharmasthala case updates) లో జరిగిన సామూహిక హత్యలు, అంత్యక్రియల వివాదం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మృతదేహాలు ఖననం కోసం తనకు ఆలయ పెద్దల నుంచే ఆదేశాలు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ధర్మస్థలలో తాను చేసిన భయంకరమైన పనులను వివరిస్తూ, ఈ సామూహిక అంత్యక్రియల వెనుక ఆలయ నిర్వహణ పెద్ద పెద్ద వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Also Read :  అహింసావాది గాంధీజీయే 60 కుక్కలు చంపించాడు.. 1927లో ఏం జరిగిందంటే?

Dharmasthala Case

1995 నుండి 2014 మధ్య కాలంలో వందలాది మృతదేహాలను ఖననం చేయాలని ఆలయ పెద్దలు ఆదేశించారని, దీనిపై నోరు విప్పితే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని అప్పడు పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన వ్యక్తి మీడియాకు తెలిపాడు. ఈ మృతదేహాల్లో ఎక్కువ మంది మహిళలు, మైనర్ బాలికలేనని, వారిపై లైంగిక దాడులు, హత్యలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అతను పోలీసులకు తెలిపాడు. ఈ మృతదేహాలను నేత్రావతి నది తీరంలో, సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఖననం చేసినట్లు అతను చెప్పాడు.

Also Read :  ఆపరేషన్ సింధూర్‌లో పని చేసిన 16మంది BSF జవాన్లకు అవార్డులు

ఈ ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం విజిల్ బ్లోయర్ చూపించిన ప్రదేశాలలో తవ్వకాలు జరిపి, ఇప్పటికే కొన్ని మానవ అవశేషాలు, ఎముకలను కనుగొంది. ఇది అతని వాదనలకు బలం చేకూరుస్తోంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, ధర్మస్థల ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్డే, అతని కుటుంబంపై పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా బెంగళూరులోని సివిల్ కోర్టు మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఈ నిషేధ ఉత్తర్వులు పత్రికా స్వేచ్ఛకు విఘాతమని, ప్రజల ముందు ఉన్న నిజాలను దాచడానికి ప్రయత్నించే చర్య అని పలు పత్రికా సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు విమర్శించారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ధర్మస్థల వంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరిగాయని చెప్పడంతో భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

latest-telugu-news | Sanitation workers | dark side of Dharmasthala | Dharmasthala Burial Case Mystery | telugu-news | telugu crime news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు