Stray Dogs: అహింసావాది గాంధీజీయే 60 కుక్కలు చంపించాడు.. 1927లో ఏం జరిగిందంటే?

జంతువుల పట్ల అపారమైన ప్రేమను, దయను కనబరిచిన గాంధీజీ, ఓ సందర్భంలో దాదాపు 60 వీధి కుక్కలను చంపేయడని ఆదేశాలిచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఇది ఆయన అనుచరులనే కాదు, నేటి జంతు ప్రేమికులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

New Update
Delhi in Stray Dogs

మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ(Mohandas Karamchand Gandhi) ఆయన్నే మనం జాతిపితా అని పిలుచుకుంటాం.. గాంధీజీ అహింసవాదీ, జంతువుల పట్ల ఆయనకున్న ప్రేమ కూడా గొప్పది. ఆయన సిద్ధాంతాలు జీవన శైలిపై ఆయనకున్న నమ్మకాలను ప్రతిబింబిస్తాయి. అయితే, జంతువుల పట్ల అపారమైన ప్రేమను, దయను కనబరిచిన గాంధీజీ, ఓ సందర్భంలో దాదాపు 60 వీధి కుక్కలను చంపేయడని ఆదేశాలిచ్చిన విషయం చాలామందికి తెలియదు. ఇది ఆయన అనుచరులనే కాదు, నేటి జంతు ప్రేమికులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఢిల్లీలో వీధి కుక్కల్ని(Delhi in Stray Dogs) షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు(Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కుక్క విషయం చర్చనీయాంశమైంది. జంతు ప్రేమికులు సుప్రీం కోర్టు తీర్పు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో గతంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. వాటిలో ఒకటి అహింసావాది అయిన గాంధీజీ సైతం 60 కుక్కల్ని చంపించాడనే వార్త వైరల్ అవుతుంది.

Also Read :  గూగుల్ క్రోమ్ కొనేందుకు పిచాయ్‌కి భారీ ఆఫర్ ఇచ్చిన అరవింద్ శ్రీనివాస్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Mahatma Gandhi Killed 60 Stray Dogs

ఈ సంఘటన 1927లో గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో జరిగింది. అప్పట్లో ఆశ్రమం చుట్టూ వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉండేది. ఈ కుక్కలు ఆశ్రమంలోని ప్రజలను, ప్రత్యేకించి పిల్లలను భయపెట్టేవి. అంటువ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా అవి కారణమవుతాయని భయపడ్డారు. కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడంతో అవి ఆశ్రమంలో ఉన్న చిన్న పిల్లలను కూడా కరిచి గాయపరిచాయి. జంతు సంక్షేమం పట్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న గాంధీజీ, తొలుత ఈ కుక్కలకు ఆహారం, ఆశ్రయం కల్పించాలని సూచించారు. కానీ, కుక్కల సంఖ్యను నియంత్రించడం, వాటిని ఆశ్రమం వెలుపల ఉంచడం సాధ్యం కాలేదు. దీంతో ఈ సమస్యపై గాంధీజీ తీవ్రంగా ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. కుక్కలు ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారినందున, వాటిని చంపడమే సరైన పరిష్కారమని ఆయన భావించారు.

Also Read :  కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు బిగ్ షాక్

ఈ నిర్ణయాన్ని ఆయన 'నవజీవన్' పత్రికలో ఒక వ్యాసంలో రాశారు. ఆ వ్యాసంలో, తాను జంతు ప్రేమికుడైనప్పటికీ, మనిషి ప్రాణాలకు, సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. "హింసకు పూర్తి వ్యతిరేకినైన నేను, ప్రజల సంక్షేమం కోసం జంతువులను చంపడం అవసరం అని గుర్తించాను. దీనిని ఒక దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నాను. కానీ, దానిని తప్పించుకోలేము." అని ఆయన రాశారు. అయితే, ఈ చర్యకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనందున, ఈ నిర్ణయం వెనుక ఉన్న పూర్తి కారణాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. గాంధీజీ జీవితంలో ఈ సంఘటన చాలా అరుదైనది. ఇది ఆయన వ్యక్తిత్వంలోని కఠినమైన, ఆచరణాత్మకమైన వైఖరిని సూచిస్తుంది.

relocate street dogs | latest-telugu-news | suprem court | mahatma-gandhi | national news in Telugu | telugu-news | telugu viral news

Advertisment
తాజా కథనాలు