మైనర్ బాలుడు దారుణ హత్య.. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న కుటుంబ సభ్యులు

ఢిల్లీ సీలంపూర్‌లో ఓ మైనర్ బాలుడు హత్యకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ , సీఎం రేఖ గుప్తాలను కోరారు. నిందితుడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశారు.

New Update
Delhi crime

Delhi crime

ఢిల్లీలోని సీలంపూర్‌లో ఒక మైనర్ బాలుడిని కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన తర్వాత ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పరిస్థితులు చేజారకముందే భద్రతా సిబ్బందిని మోహరించారు. మైనర్ బాలుడు కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు అర్థరాత్రి నుంచి నిరసన కొనసాగిస్తున్నాయి. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ , సీఎం రేఖ గుప్తాల సహాయాన్ని నిరసనకారులు కోరారు. అయితే నిరసనలో హిందువుల వలస పోస్టర్లును కూడా పెట్టారు. అయితే ఆ పోస్టర్లలో హిందూ ప్రజలు ఆ ప్రాంతం నుంచి వలస వెళ్తున్నారని రాశారు. 

ఇది కూడా చూడండి:Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

అసలేం జరిగింది?

ఈశాన్య ఢిల్లీలో సీలంపూర్‌లోని జె-బ్లాక్‌లో 17 ఏళ్ల బాలుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. అదే ప్రాంతానికి చెందిన రాజ్‌వీర్ కుమారుడు కునాల్‌ పొడిచాడు. వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. అయితే కునాల్ ఆ మైనర్ బాలుడిని ఎందుకు కత్తితో చంపాడనే కారణం ఇంకా తెలియదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీలంపూర్‌లో నిరసనలు చేస్తున్నారు. దీంతో ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ స్తంభించింది. తమకు ఎలాగైనా కూడా న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి:Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

Advertisment
తాజా కథనాలు