Couple Burned Alive: గుండెపగిలే ఘోరం.. ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి దంపతులు సజీవ దహనం..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగడంతో వృద్ధ దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో వారి మనవరాలు మాత్రం క్షేమంగా బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Couple burnt alive after electric scooter explodes in Uttar Pradesh

Couple burnt alive after electric scooter explodes in Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) లోని ఆగ్రాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు(electric scooter explodes) చెలరేగాయి. దీంతో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న దంపతులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్.. ప్రధాని మోదీ హెల్తీ డైట్ ఏంటో మీకు తెలుసా?

Couple Burnt Alive 

ఆగ్రాలోని జగదీష్‌పురాలో లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. ప్రమోదుకు పెళ్లై ఒక పాప కూడా ఉంది. అతడు పైన అంతస్తులో తన ఫ్యామిలీతో నివశిస్తుండగా.. అతడి తల్లిదండ్రులైన  90 ఏళ్ల భగవతి ప్రసాద్, 85 ఏళ్ల ఊర్మిళా దేవి  గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నారు. అయితే తాజాగా ప్రమోద్ తన ఇంట్లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఛార్జింగ్ పెట్టి పడుకోవడానికి ఇంటి పైకి వెళ్లాడు. అదే సమయంలో తన 14 ఏళ్ల కుమార్తె కాకుల్‌ను తాత, నాన్నమ్మ దగ్గరే వదిలిపెట్టి వెళ్లాడు. 

అలా కొద్ది సేపటి తర్వాత ఒక్కసారిగా స్కూటర్‌ బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు ఇంటి అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో నిద్రిస్తున్న ప్రమోద్ తల్లిదండ్రులు భగవతి ప్రసాద్, ఆయన భార్య ఊర్మిళా దేవి, 14ఏళ్ల చిన్నారి కాకుల్ మంటల్లో చిక్కుకున్నారు(Couple Burned Alive). వెంటనే తాత భగవతి ప్రసాద్ తన మనవరాలు కాకుల్‌ను ఎలాగోలా నిద్రలేపి పైకి పంపాడు. 

Also Read :  RSS నుంచి అత్యున్నత పదవి వరకు.. మోదీ అరుదైన ఫొటోలివే!

కానీ భగవతి, అతని భార్య ఊర్మిళ లోపల చిక్కుకున్నారు. మంటలు చాలా తీవ్రంగా ఉండటం వల్ల తలుపు తెరవడం అసాధ్యంగా మారింది. కుటుంబ సభ్యులు పై అంతస్తు నుండి నీళ్లు పోసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో ఎవరూ కిందకు దిగలేకపోయారు. అనంతరం ఆ శబ్దం విని సమీప నివాసితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఆపై అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. 

ఇంతలో.. కాలిన గాయాలతో ఉన్న వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు. కానీ వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర డీసీపీ సోనమ్ కుమార్ తెలిపారు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.

Advertisment
తాజా కథనాలు