Wedding: పెళ్లి వేడుకలో వధువుపై రూ.8 కోట్ల నోట్ల వర్షం ? వీడియో వైరల్..

పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆశ్చరకర ఘటన చోటుచేసుకుంది. వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుపై ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లారనే ప్రచారం నడుస్తోంది.

New Update
Punjab bride showered with Rs 8.5 crore at wedding? Groom's family denies claim

Punjab bride showered with Rs 8.5 crore at wedding? Groom's family denies claim

పంజాబ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆశ్చరకర ఘటన చోటుచేసుకుంది. వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతోంది. వధువుపై ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఆ కుటుంబం ఈ వార్తలను ఖండించింది. తాము అంతగా ఖర్చు చేయలేదని.. కేవలం రూ.2 లక్షల విలువైన కరెన్సీ నోట్లను మాత్రమే వెదజల్లినట్లు స్పష్టం చేసింది. 

Also Read: నార్త్‌కొరియాలో ఆధిపత్య పోరు.. కిమ్ కూతురు, సోదరి మధ్య వారసత్వ పోటీ

Punjab Bride Showered With Rs 8.5 Crore At Wedding

ఇక వివరాల్లోకి పంజాబ్‌లోని తర్న్‌ జిల్లాలో ఫిబ్రవరి 14న ఈ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో వధువు వేదిక వద్ద నిలబడి ఉండగా కుటుంబ సభ్యులు ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. వేడుకకు వచ్చిన వారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. పెళ్లి కూతురుపై రూ.8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు వెదజల్లినట్లు ప్రచారం నడిచింది.

Also Read: పాక్, చైనాకు చుక్కలే.. ఫ్రాన్స్‌తో భారత్‌ సంచలన ఒప్పందం

చివరికి దీనిపై స్పందించిన ఆ కుటుంబ సభ్యులు కేవలం రూ.2 లక్షల విలువైన కరెన్సీ నోట్లే వాడినట్లు క్లారిటీ ఇచ్చారు. తమపై ఇలా తప్పుడు ప్రచారాలు చేసిన సోషల్ మీడియా అకౌంట్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ వివాహ వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్ కూడా దీనిపై స్పందించారు. పెళ్లికూతురుపై రూ.4 లక్షల విలువైన కరెన్సీ నోట్లను వాడినట్లు చెప్పారు.  

Advertisment
తాజా కథనాలు