/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-jpg.webp)
Crime: బీహార్‌లో మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. భూ వివాదాల కారణంగా ఓ కుటుంబం పసిబిడ్డను బలితీసుకోవడం సంచలనం రేపింది. అభంశుభం తెలియని పసిబిడ్డను కొట్టి చంపిన దుర్మార్గులు.. శవాన్ని తీసుకొచ్చి కన్నతల్లి ఓడిలో పెట్టడం స్థానికులను కలిచివేసింది. బిస్కెట్ ఇస్తామని చెప్పి నమ్మించి ఈ పాపానికి ఒడిగట్టిన ఘటన బిహార్ బెగుసరాయ్ జిల్లాలో జరగగా ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కిరాణ షాపుకు వెళ్లగానే..
ఈ మేరకు బెగుసరాయ్‌లోని చక్‌బల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా భూ వివాదం జరుగుతోంది. రెండు కట్టా, 15 ధూర్ భూమి విషయంలో బాలకృష్ణ సింగ్, అన్మోల్ సింగ్ మధ్య పంచాయితీలు నడిచాయి. అయినప్పటికీ పలుమార్లు గొడవపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అన్మోల్ సింగ్ కొడుకు (5) బిస్కెట్ కొనుక్కోవడానికి కిరాణ షాపుకు వెళ్లాడు. ఇది గమనించిన బాలకృష్ణ సింగ్ కుటుంబ సభ్యులు అతన్ని ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లి పదునైన వస్తువుతో తలపై కొట్టి చంపారు.
Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఆ తర్వాత మృతదేహాన్ని ఎత్తు్కెళ్లి 'ఇదిగో నీ కొడుకు చనిపోయాడు' అంటూ తల్లి రింకు దేవి ఒడిలో పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి మొదలవగా స్థానికులు, అన్మోల్ బంధువులు నిందితులను కొట్టేందుకు ప్రయత్నించగా పారిపోయారు. దీంతో కోపంగా రగిలిపోయిన ప్రజలు గ్రామ రహదారిని దిగ్బంధించారు. నిందితులను తమకు అప్పగించాలంటూ పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. చివరికి వారందిరినీ ఒప్పించి శాంతింపజేసిన పోలీసులు.. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ మనీష్ తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాతే అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు.
Also Read: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
bihar | children | died | land-issue | telugu-news | today telugu news