Stalin Re- Release: చిరు ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్‌..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీ 8కె ఫార్మాట్‌లో జూన్‌లో రీ-రిలీజ్ కానుంది. మరోవైపు ఆయన నటిస్తున్న విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు చిత్రాల్లో త్రిష కథానాయికగా నటించడం విశేషం.

New Update
Stalin Re- Release

Stalin Re- Release

Stalin Re- Release: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష(Trisha) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి విడుదల తేదీని ఇంకా అఫిషియల్ గా ప్రకటించలేదు.

Also Read: మరో బడా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మిల్కీ బ్యూటీ.

అయితే, చిరంజీవి అభిమానుల కోసం మరో శుభవార్త బయటకి వచ్చింది. 2006లో విడుదలైన చిరంజీవి సూపర్ హిట్ సినిమా స్టాలిన్ మళ్లీ భారీ రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. అనియానా ప్రొడక్షన్స్ ఈ రీ-రిలీజ్ బాధ్యతలు తీసుకుని, ఈ సినిమాను అత్యాధునిక 8కె ఫార్మాట్‌లో రీస్టోర్ చేయిస్తోంది.

Also Read: చక్రం క్లైమాక్స్ రిపీట్.. ప్రభాస్ ను చంపబోతున్న మరో డైరెక్టర్..?

జూన్ లో 'స్టాలిన్' రీ-రిలీజ్‌

పనులన్నీ అనుకున్న ప్రకారం పూర్తయితే, 'స్టాలిన్' రీ-రిలీజ్‌ను జూన్ మద్యలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విశేషం ఏంటంటే స్టాలిన్ సినిమాలోనూ త్రిషే కథానాయికగా నటించారు. 

Also Read: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో

ఈ మూవీలో ఖుష్బూ సుందర్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మణి శర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత హైలైట్‌ గా నిలిచింది. స్టాలిన్ రీ-రిలీజ్‌కి సంబంధించి మరిన్ని అప్డేట్స్‌తో పాటు విశ్వంభర గురించి తాజా సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Also Read: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు