Uttarakhand: ఉత్తరాఖండ్‌లో దారుణం.. హిమపాతంలో చిక్కుకున్న 57 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. చమోలి జిల్లా మానా గ్రామంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ విషాద ఘటనలో 57 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
Over 50 workers feared trapped as avalanche hits Uttarakhand's Chamoli

Over 50 workers feared trapped as avalanche hits Uttarakhand's Chamoli

ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది. చమోలి జిల్లా మానా గ్రామంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ విషాద ఘటనలో 57 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) అలాగే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు ఘటనా స్థలంలో ఉన్నాయి.

మంచులో చిక్కుకున్న కార్మికుల్లో 10 మందిని రక్షించి క్యాంప్‌నకు తరలించారు. మిగతా వారి ఆచూకి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. మంచు దట్టంగా కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: గజగజ వణికిస్తున్న భారీ అగ్ని ప్రమాదం.. 42వ అంతస్తులో ఎగసిపడిన మంటలు!

మరోవైపు భారత వాతావరణశాఖ కూడా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 28 (శుక్రవారం) రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమేదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో చమోలి జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. బద్రినాథ్ ధామ్, హనుమాన్‌చట్టి, మలారి, అవులీ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

Also Read: ఏపీ బడ్జెట్లో రైతులపై వరాల జల్లు.. 20 శుభవార్తలు.. లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు