ఏఎస్ఐ పీక కోసేశాడంటూ..
ఈ మేరకు రక్తం కారుతుండగానే అర్ధనగ్నంగా కనిపించిన సురేష్.. వారం రోజుల క్రితం తనను కానిస్టేబుల్ కొట్టిన సంఘటనపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. కేసు అడగటానికి వస్తే ఏఎస్ఐ పీక కోసేశాడని, అందుకే మిగిలినది తాను కోసుకుంటున్నానని అన్నాడు. అయితే ఎట్టకేలకు మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్, స్థానికులు కొంత మంది కలిసి చికిత్స నిమిత్తం సురేష్ ను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Also Read : లగచర్లలో మళ్లీ హై టెన్షన్..!
అసలేం జరిగిందంటే..
సురేశ్ తండ్రి బాల కోటయ్య 2024 వినాయకచవితి రోజు అదే గ్రామంలో సొంత బంధువుల చేతిలోనే హత్యకు గురయ్యారు. గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు లంచాలు తీసుకుని పట్టించుకోకపోవడమే తన తండ్రి మృతికి కారణమని బాలకోటయ్య కుమారులు చైతన్య, సురేష్ ఆరోపించారు. దీంతో మూడు నెలలుగా గ్రామంలో పోలీసు పికెట్టు నిర్వహిస్తున్నారు. వారంరోజుల క్రితం హత్య కేసులో ఏ1కు మినహా నలుగురికి బెయిల్ వచ్చింది. ఇది తెలియడంతో అందుకు కారణం పోలీసులేనంటూ సురేశ్ పోలీసుస్టేషన్ వద్దకు వచ్చి సుమారు రెండు గంటల పాటు బ్లేడుతో కోసుకుంటానని హడావుడి చేశారు. 108లో అతనిని ఆసుపత్రికి తీసుకు వెళ్లలేక నిస్తేజంగా ఉండిపోవడంతో అతనే వెళ్లిపోయాడు. దీనిపై కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ను సంప్రదించగా విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సురేశ్ పూర్తిగా మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని చెప్పారు. వారంరోజుల క్రితం ఇలాగే సుమారు 2 గంటల పాటు మద్యం మత్తులో కోసుకుంటానంటూ హడావుడి చేశాడని తెలిపారు. సమగ్ర విచారణ చేసి తదుపరి చర్యలు చేపడతామని ఆయన తెలిపారు.
Also Read : నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా?
Also Read : ఇండియాలో కృష్ణజింకలు కనిపించే టాప్ 5 ప్రదేశాలు ఇవే..!