ఇండియాలో కృష్ణజింకలు కనిపించే టాప్ 5 ప్రదేశాలు ఇవే..! కృష్ణ జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ జంతువులను దగ్గరగా చూడాలనుకుంటే.. భారతదేశంలోని ఈ టాప్ 5 ప్రదేశాల్లో చూడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 13 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 కృష్ణ జింకలు.. వాటి ప్రత్యేకమైన కొమ్ములకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి గడ్డి భూములను సారవంతంగా ఉంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి. వీటి కొమ్ములు, చర్మం అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. కాలేయం, గుండె జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి. 2/7 ఈ అందమైన కృష్ణ జింకలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ జంతువులను దగ్గరగా చూడాలనుకుంటే.. భారతదేశంలోని ఈ టాప్ 5 ప్రదేశాల్లో చూడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 3/7 తమిళనాడు వల్లందు వైల్డ్ లైఫ్ సాంచురీ వల్లందు వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడులో ఉంది. ఇది కృష్ణ జింకలను చూడడానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశంగా చెబుతారు. ఇక్కడ పర్యావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణ జింకలతో పాటు వైవిధ్యమైన వన్యప్రాణులను చూడవచ్చు. 4/7 తాల్ చపర్ అభయారణ్యం, రాజస్థాన్ తాల్ చపర్ అభయారణ్యం రాజస్థాన్ లోని చురు జిల్లాలో ఉంది. ఇది జైపూర్ నుంచి 210 కి.మీ దూరంలో థార్ ఎడారి దగ్గర్లో ఉంటుంది. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేముకులకు ఇది చాలా మంచి ప్రదేశంగా చెబుతారు. 5/7 జాతీయ చంబల్ అభయారణ్యం ఈ అభయారణ్యం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మూడు రాష్ట్రాల్లోని భాగాలను కవర్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రాంతం 5,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ కృష్ణ జింకలతో పాటు ఘారియల్ మొసలి, గంగా నది డాల్ఫిన్ వంటి అరుదైన జంతువులకు ఈ అభయారణ్యం సురక్షితమైన ప్రదేశం. 6/7 పాయింట్ కాలిమెర్ వన్యప్రాణుల, పక్షుల అభయారణ్యం తమిళనాడులోని ఈ అభయారణ్యం పాక్ జలసంధికి సమీపంలో 21.47 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కృష్ణ జింకలను వీక్షించడానికి ఇది మరొక అద్భుతమైన ప్రదేశం. ముఖ్యంగా కృష్ణ జింకల పరిరక్షణ కోసం ప్రభుత్వం 1967లో ఏర్పాటు చేసింది. 7/7 వెలవాదర్ బ్లాక్‌బక్ నేషనల్ పార్క్ కృష్ణజింకలను చూడడానికి ఇదొక అద్భుతమైన ప్రదేశం. ఈ ఉద్యానవనం అధిక మొత్తంలో గడ్డి భూములను కలిగి ఉంటుంది. ఈ భూములు కృష్ణ జింకలకు సరైన ప్రదేశం. భారత దేశంలో అత్యంత కృష్ణ జింకల జనాభా కలిగిన ఒకటిగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి