HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్
దగ్గుబాటి సురేష్, రానా, అభిరామ్‌పై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను పాటించకుండా దౌర్జన్యం చేశారన్న అభియోగాలు వీరిపై ఉన్నాయి.