Rana : మరోసారి హోస్ట్ గా దగ్గుబాటి రానా.. బాలయ్యకు పోటీగా టాక్ షో

దగ్గుబాటి రానా మరోసారి హోస్ట్ గా మారబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కలిసి టాక్ షో చేయనున్నాడు. ఈ టాక్ షో 'ది రానా దగ్గుబాటి' షో పేరుతో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుపుతూ రానా తన ఎక్స్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు.

New Update
sedfg

దగ్గుబాటి రానా మరోసారి హోస్ట్ అవతారం ఎత్తనున్నాడు. గతంలో ఆయన ‘నెం.1యారి’ అనే టాక్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించగా.. ఈ టాక్ షో మంచి సక్సెస్ అయింది. టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని.. తమ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలు కూడా పంచుకున్నారు. 

Also Read :  బికినీలో 'లైగర్' బ్యూటీ హాట్ షో.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు

అమెజాన్ ప్రైమ్ తో కలిసి..

ఇక ఈసారి అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కలిసి 'ది రానా దగ్గుబాటి షో' తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలను ఓటీటీ సంస్థ తాజాగా వెల్లడించింది.  ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇది కేవలం టాక్‌ షో మాత్రమే కాదని.. అంతకు మించిన సరదా సంభాషణలతో ఇది సాగుతుందని పేర్కొంది.  

Also Read : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..?

Also Read :  ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..?

నవంబర్‌ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ టాక్ షో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది. కాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ  బాలయ్య 'అన్ స్టాపబుల్' టాక్ షోకి పోటీగా దగ్గుబాటి రానాతో ఈ టాక్ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' షోతో 'ఆహా' ఓటీటీకి భారీ ఆదరణ దక్కడంతో పాటూ సబ్స్ క్రైబర్స్ సంఖ్య కూడా పెరిగింది. 

ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సైతం 'ది రానా దగ్గుబాటి' షో తో  సబ్స్ క్రైబర్స్ సంఖ్య పెంచుకోవాలని చూస్తోంది. మరి ఈ టాక్ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? అనే వివరాలను నిర్వాహకులు త్వరలోనే రివీల్ చేయనున్నారు. మరి ఈ షో ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Also Read : నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు