/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/murder1-jpg.webp)
AP Crime: ఏపీలో పట్టపగలే అమానుష ఘటన జరిగింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లిలో ఓ వ్యక్తిని మద్యం మత్తులు ముగ్గురు యువకులు దారుణంగా హతమార్చడం కలకలం రేపుతోంది. వాడపల్లిలో చెరువులో చేపల దొంగతనానికి వెళ్లిన దుర్మార్గులు.. కాపాలాదారుడిని అతికిరాతకంగా తాటి గరికతో పీక కోసి, కర్రలతో కొట్టి చంపేశారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడగా వివరాలు ఇలా ఉన్నాయి.
దొంగతనం చేయొద్దన్నందుకు..
ఈ మేరకు రోజువారిలాగే మృతుడు మారేడు మిల్లి మండలం వొంటుకుల చిన్నారెడ్డి (55) చేపల చెరువు వద్ద కాపాలా ఉన్నాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో చేపల దొంగతనానికి పాల్పడుతున్న యువకులను మందలించాడు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఆగ్రహానికి లోనై బెదిరించాడు. దీంతో విచక్షణ కోల్పోయిన ఆ ముగ్గురు చిన్నారెడ్డిపై దాడికి పాల్పడ్డారు.
దీంతో రక్షణ కోసం ఆయన వారిపై దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే దుండగులు తాటి గరికలతో చిన్నారెడ్డి మెడను కోసి, కర్రలతో కొట్టి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు వాడిన గరిక, కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులు మారేడు మిల్లి మండలం వైదపూడి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మద్యం మత్తులో ఉన్నా నిందితులను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: CPIM: రేవంత్ పై ఇక యుద్ధమే.. సీపీఎం కొత్త కార్యదర్శి జాన్ వెస్లీ సంచలన ఇంటర్వ్యూ!