Breaking: నాకు బెయిల్ వద్దు, లాయర్లు వద్దు.. జడ్జి ఎదుట గురుమూర్తి షాకింగ్ కామెంట్స్!

మీర్ పేట్ మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇక కోర్టులో జడ్జి ఎదుట 'నాకు బెయిల్ వద్దు. న్యాయవాదులు వద్దు' అని చెప్పాడు గురుమూర్తి. 

New Update
Meerpet EX Army Gurumurthy Case Update

Meerpet EX Army Gurumurthy Case Update

Gurumurthy: మీర్ పేట్ మాధవి హత్య కేసులో నిందితుడు గురుమూర్తికి రంగారెడ్డి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. ఇక కోర్టులో జడ్జి ఎదుట 'నాకు బెయిల్ వద్దు. న్యాయవాదులు వద్దు' అని చెప్పాడు గురుమూర్తి.  

విచారణలో సంచలనాలు.. 

ఈ మర్డర్ కేసులో పోలీసులు కీలక అప్ డేట్స్ బయటపెట్టారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు నిద్రలేచిన వెంటనే మాధవి గురుమూర్తిల మధ్య గొడవ స్టార్ట్ అయిందని చెప్పారు. గొడవ కావడంతో మాధవిని చంపాలని గురుమూర్తి అనుకున్నాడని, అందుకోసమే ఆమెని కొట్టినట్లు నిర్ధారించారు. మొదట ఆమె చెంపపై కొట్టడంతో గోడకు తాకి కుప్పకూలిపోయిందని, వెంటనే ఆమెస్పృహ కోల్పోయిన ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె గొంతు పిసికేసినట్లు తెలిపారు. మాధవి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాధవి శరీరంపై ఉన్న బట్టలను తొలగించి డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలు చేసినట్లు వెల్లడించారు.

Also Read: Arunachal Pradeh: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్

శరీర భాగాలు ఉడికించి..

ఈ మేరకు పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఆమె చనిపోయిన తర్వాత కిచెన్‌లో నుంచి కత్తి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ మాధవి భుజాలను కట్ చేశాడు.  డెడ్ బాడీ నుండి చేతులను వేరు చేశాడు. ఆ తర్వాత డెడ్ బాడీ నుండి కాళ్లను కూడా వేరు చేశాడు. కాళ్లు, చేతులను ముక్కలు ముక్కలు చేశాడు. ముక్కలుగా చేసిన కాళ్లు చేతుల భాగాలను బకెట్లో వేశాడు. బకెట్లో వాటర్ హీటర్ పెట్టాడు. బాగా శరీర భాగాలు ఉడికిన తర్వాత బకెట్లోంచి ఆ భాగాలను తీసి స్టవ్ పై కాల్చివేశాడు. కాలిన ఎముకలను రోటిలో దంచి పౌడర్ చేశాడు. ఆ పౌడర్ ను బాత్రూంలో వేసి అనేక సార్లు ఫ్లెష్ చేశాడు. మరికొన్ని చిన్నచిన్న ఎముకలను డస్ట్ బిన్ లో వేసి పడేసినట్లు తెలిపారు.

Also Read: Thandel Trailer: అక్కినేని ఫ్యాన్స్ కి పండగే .. తండేల్ ట్రైలర్ గూస్ బంప్స్

అయితే ఇదంతా చేస్తున్నపుడు కిచెన్ డోర్, ఇంట్లో, కిటికీలు తలుపులు తెరిచి ఉంచినట్లు వెల్లడించారు. గురుమూర్తి వాసన రాకుండా ఉండేందుకు సుమారు 8 గంటల పాటు డిటర్జెంతో పాటు ఫినాయిల్ ఉపయోగించి ఎవిడెన్స్ లేకుండా చేశాడని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 16 వస్తువులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు