/rtv/media/media_files/2025/02/24/CJyOZLo4QO7IPUCBa1JU.jpg)
Anantapur love case Two girls drank poison for boyfriend
AP Love case: ఏపీలో మరో లవ్ కేసు సంచలనం రేపుతోంది. ఒక యువకుడి కోసం పోటీపడిన ఇద్దరు యువతులు దారుణానికి పాల్పడ్డారు. మనసు ఇచ్చినవాడు తమకు దక్కుతాడో లేదో, తమ ప్రేమను అంగీకరిస్తాడో లేదోననే భయంతో ఇద్దరు కలిసి ఆత్మహత్యయత్నం చేశారు. విషం తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారిని బంధువులు ఆస్పత్రికి తరలించగా ఒకరు చనిపోయారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉండగా రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది.
ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలియదు..
ఈ మేరకు బాధితుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఈ ఘటన జరిగింది. దివాకర్ అనే యువకుడిని రేష్మ, శారద అనే ఇద్దరు అమ్మాయిలు ఇష్టపడ్డారు. అయితే దివాకర్ ఎవరిని ప్రేమిస్తున్నాడో వారికి తెలియదు. ఎప్పుడు చెప్పలేదు. దీంతో కొంతకాలంగా భ్రమలో బతుకున్న యువతులు.. ఇటీవల ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. కానీ ఇద్దరి దగ్గర సమాధానం లేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన వారిద్దరూ దివాకర్ తమకు దక్కడేమోనని బాధపడ్డారు. అతడు లేని జీవితం తమకు వద్దనుకున్నారు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని స్థానిక ఆర్టీవో ఆఫీస్ ముందు జుట్టుకు రంగు వేసే కెమికల్ (సూపర్ వాస్కోల్) తాగారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: జగన్ జర్మనీ వెళ్లాలి.. పవన్ సెటైర్లు!
మృతురాలి పేరెంట్స్ ఫిర్యాదు..
ఈ విషయం వారే దివాకర్ కు ఫోన్ చేసి చెప్పగానే ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆర్టీవో ఆఫీస్ వద్దకు చేరుకుని రేష్మ, శారదలను ఆస్పత్రికి తరలించాడు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ శారద చనిపోగా రేష్మ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తమ బిడ్డను అన్యాయంగా చంపేశాడంటూ శారద తల్లిదండ్రులు దివాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.