TG Crime: తెలంగాణలో దారుణం.. పెళ్లి వొద్దన్నందుకు పిల్ల తండ్రిని కత్తెరతో పొడిచిన మైనర్‌ బాలుడు!

తెలంగాణలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల ప్రాయంలో పెళ్లి వొద్దన్న ప్రియురాలి తండ్రిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్‌ వైఎస్సార్‌ కాలనీకి చెందిన కుర్రాడు అమ్మాయి తండ్రిని కత్తెరతో పొడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

New Update
hyd crime

Nirmal Minor boy attacks on girlfriend father

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. 16 ఏళ్ల ప్రాయంలో పెళ్లి వొద్దన్న ప్రియురాలి తండ్రిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిర్మల్‌ వైఎస్సార్‌ కాలనీకి చెందిన కుర్రాడు.. అమ్మాయి ఇంటికెళ్లి కత్తెరతో పొడిచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నాలుగేళ్లుగా ప్రేమ..

ఈ మేరకు నిర్మల్‌ సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్‌ పట్టణంలో తాపీ మేస్త్రీగా పని చేసే ఓ బాలుడు(16) తమ ఇంటికి దగ్గరలో ఉండే (16) బాలికతో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే ఇటీవల ఆమెను పెళ్లి చేసుకుందామని అడిగాడు. కానీ ఆ బాలికి పెళ్లికి అంగీకరించలేదు. తమకు ఇంకా 16 ఏళ్ల వయసు ఉందని, మరో 4 ఏళ్లు ఆగిన తర్వాత చేసుకుందామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. అయినా వినకుండా వేధింపులు మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా బాలిక తండ్రితో సైతం పెళ్లి చేయాలంటూ గొడవకు దిగాడు. పెళ్లి కావాలని ఇంటిముందు నానా రచ్చ చేశాడు. 

ఇది కూడా చదవండి: SLBC tunnel: 40ఏళ్ల నాటి ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలే.. SLBC ప్రాజెక్ట్ హిస్టరీ ఇదే..!!

అయితే పెళ్లి వయసు వచ్చాక మాట్లాడుకుందామని బాలిక తండ్రి చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలుడు ప్రేమించిన అమ్మాయి దూరమవుతుందని భావించి కోపం పెంచుకున్నాడు. బాలిక తండ్రిని చంపితే పెళ్లికి ఎవరు అడ్డు ఉండరని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడు వైఎస్సార్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ తౌసిఫ్‌ ఉల్లా(20)తో కలిసి అర్ధరాత్రి ఇంటికి వెళ్లి కత్తెరతో పొడిచి పారిపోగా.. పోలీసులు గాలించి పట్టుకుని ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కుటుంబసభ్యులు బాలిక తండ్రిని నిజామాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: Sridevi Death Anniversary: 7ఏళ్లు దాటినా వీడని శ్రీదేవి మరణం మిస్టరీ.. బాత్‌టబ్‌లో ముంచి చంపేశారా?

Advertisment
తాజా కథనాలు