విషాదం.. బైక్‌పై వెళ్తుండగా చున్నీ చుట్టుకుని మహిళ మృతి

అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్‌ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.

New Update
Anakapalli accident

Anakapalli accident

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుకోకుండా చున్నీ మెడకు చుట్టుకోవడంతో వివాహిత మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. అచ్యుతాపురం మండలానికి చెందిన విన్నకోట మొహన్‌కృష్ణతో కళ్యాణపు రామదుర్గకు 9 నెలల కిందట వివాహం జరిగింది. అయితే మోహన్‌కృష్ణకు అచ్యుతాపురం సెజ్‌లో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో దంపతులు అద్దె ఇల్లు తీసుకుని అక్కడే ఉంటున్నారు.

ఇది కూడా చూడండి: Jammu and Kashmir: లోయలో పడిపోయిన CRPF జవాన్ల వాహనం

మెడకు చున్నీ చుట్టుకుని..

రామదుర్గకు చెవి నొప్పి రావడంతో.. భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లింది. ఆమె వేసుకున్న చున్నీ బైక్ వెనుక చక్రంలో పడి మెడకు చుట్టుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చూడండి:Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు

ఇదిలా ఉండగా తాజాగా విశాఖ జిల్లా సింహాచలం చందనోత్సవంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్‌‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది.

ఇది కూడా చూడండి:DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం

వెంటనే అధికారులు అక్కడిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు