Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. పేలిన గ్యాస్‌ సిలిండర్, మహిళ మృతి

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్‌ పీఎస్‌ పరిధిలోని కమాన్‌గల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
A woman died after gas cylinder explosion in hyderabad

A woman died after gas cylinder explosion in hyderabad

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి(gas-cylinder-blast) మహిళ మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే మధురానగర్‌ పీఎస్‌ పరిధిలోని కమాన్‌గల్లీలో ఓ భవనం ఉంది. దాని మొదటి అంతస్తులోని ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సోనూ బాయ్(40) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులు గోపాల్‌సింగ్, లలితా బాయ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి.

Also Read: కొత్త లేబర్ కోడ్..కార్మికులకు అదనపు భద్రత, సంక్షేమం

Gas Cylinder Explosion In Hyderabad

అక్కడున్న వాళ్లు గాయపడ్డవారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడికి జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన ఓదార్చారు. 

Also Read: రెండు సెకన్ల వీడియో.. 100 మిలియన్ల వ్యూస్‌..ఇంతకీ ఏం జరిగిందంటే?

Advertisment
తాజా కథనాలు